GET MORE DETAILS

అంకెలతో ఆట : : క్యాలండరుతో తమాషా

అంకెలతో ఆట : : క్యాలండరుతో తమాషా



మీ మిత్రుడిని క్యాలండరులో ఒక నెలలో 2x2 చదరంలో ఉన్న నాలుగు సంఖ్యలను తీసుకోమనండి. ఆ అంకెల్ని అదే క్రమంలో లంబూ, జంబూ, చింటూ, కిట్టూ అనే స్నేహితులకు వరుసగా ఇవ్వమనండి. తరువాత,  తలచుకున్న సంఖ్యల మొత్తాన్నికలిపి చెప్పమనండి. అతను మొత్తము చెప్పగానే అతను తలచుకున్న సంఖ్యలేంటో, ఏ పిల్లాడికి ఏ సంఖ్య ఇచ్చారో చెప్పేయచ్చు.

కిటుకు :  అతను తలచుకున్న అంకెల మొత్తము చెప్పగానే దానిని మీరు 4 చేత భాగించి, 4ని తీసివేయాలి. అప్పుడు మొదటి అంకె వచ్చేస్తుంది. ఇది లంబూకి ఇచ్చిన సంఖ్య. దీని తరువాత వచ్చే వరుస సంఖ్యే జంబూకి  ఇచ్చిందవుతుంది. ఇక లంబూ సంఖ్యకు 7 కలిపితే చింటూ సంఖ్య వచ్చేస్తుంది. దీనిని బట్టి కిట్టూ సంఖ్యని చెప్పేయచ్చు.

ఉదాహరణ : మీ స్నేహితుడు ఒక క్యాలండరులో ఒక  నెలలో [13,14, 20, 21]  అనే 2x2 చదరాన్ని తలచుకున్నాడనుకుందాం. అంటే లంబూకి 13,  జంబూకి 14, చింటూకి 20,  కిట్టూకి 21 ఇచ్చాడు. నాలుగు అంకెల మొత్తం 13+14+20+21=68. ఈ ఫలితాన్నే అతను మీకు చెపుతాడు. దీనిని 4 చేత భాగిస్తే 68/4=17. దీన్లోంచి  నాలుగు తీసివేస్తే 17-4=13. ఇది లంబూకి ఇచ్చిన సంఖ్య. దీని తరువాత సంఖ్య 14 జంబూకి ఇచ్చింది. ఇక లంబూకి ఇచ్చిన సంఖ్యకి 7 కలిపితే చింటూకి ఇచ్చిన సంఖ్య 20 వచ్చేస్తుంది. దీని తరువాత వచ్చే సంఖ్యే కిట్టూకిచ్చినదవుతుంది.

Post a Comment

0 Comments