తనుమలయన్ ఆలయం - తమిళనాడు
తమిళనాడులోని కన్యాకుమారికి 10 కిలోమీటర్ల దూరంలో " సుచీంద్రం " అనే ఊరిలో ఉన్న " తనుమలయన్ ఆలయం " భారతీయ శిల్పకళా వైభవానికి ఓ మచ్చుతునక!
◆ చోళ రాజులచేత నిర్మించబడిన ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం ఎత్తు 134 అడుగులు. అంత ఎత్తున్న ఈ ఆలయ ప్రధాన గోపురంపై ఒక లక్షకి పైగా శిల్పాలున్నాయంటే అది అతిశయోక్తి మాట కాదు.
◆ గౌతమ మహర్షి శాపం నుండి ఇంద్రుడు విముక్తి పొందడానికై త్రిమూర్తులను ఏక లింగంపై ప్రతిష్టించి కొలిచిన ప్రదేశం ఇదని పురాణకధనం.
◆ ఈ ఆలయంలోని అలంకార మండపంలో ముట్టుకుంటే సంగీతం వినిపించే సంగీత స్థంభాలు ఉన్నాయి. ఒక్కో స్థంభం ఒక్కో విధంగా ధ్వనించడం ఇక్కడి విశేషం.
◆ ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం మనకు కనిపిస్తుంది.
ఇలా అనేక విశేషాలతో నిండి ఉన్న ఈ ఆలయం తమిళనాడులో తప్పకుండా చూడవలసిన ఆలయాలలో ఒకటి.
0 Comments