GET MORE DETAILS

అగ్నిపథ్ ప్రమాదమా ? ప్రయోజనామా ?

 అగ్నిపథ్ ప్రమాదమా ? ప్రయోజనామా ?



30 లక్షల మందికి జీతాలు చెల్లించి  కూర్చోబెట్టడం సమంజసం కాదట, సుమారు రెండు లక్షల కోట్లు వృధా అని కొంతమంది వాదన.

సమాధానం : సైన్యం అనేది దేశ భౌగోళిక స్వరూపాన్ని,130 కోట్ల మంది ప్రజలను కాపాడే ఒక రక్షణ వ్యవస్థ. 38 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు సైన్యానికి వెచ్చించడం తప్పు ఎలా అవుతుంది?

పోనీ ఈ మేధావులు  చెప్పినట్లు రక్షణ వ్యయం తగ్గించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు, సైనికులకు చెల్లిస్తున్న డబ్బును తగ్గించి దానికి బదులు ఆయుధాలు కొనుగోలు పేరుతో కొన్ని కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెట్టే ప్రయత్నం ఇది.

అంటే 30 లక్షల కుటుంబాలకు చెల్లెస్తున్న డబ్బును 2 లేదా 3 కంపెనీ లకు చెల్లిస్తారన్న మాట!.ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా మంచిదవుతుంది?

సైనికులకు జీతాలు, భత్యాలు పేరున ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బును  వారు ఈ దేశంలో వినియోగించటం లేదా? ఈ దేశంలోని  మార్కెట్లలో పప్పు,ఉప్పు, టీవీ,ఫ్రిడ్జ్ కార్లు ఇలా అనేక సరుకులు కొనుగోలు చేస్తే అదే ఆర్ధిక వ్యవస్థ కు ప్రయోజనకరం కాదా? అదే ఒకట్రెండు కంపెనీలకు లక్షల కోట్లు ధారాదత్తం చేస్తే ఈ దేశానికీ ఏం ప్రయోజనం?ఈ లాజిక్ ఈ మేధావులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?

దేశంలో కార్పొరేట్ కంపెనీలు దేశీయ బ్యాంకు లకు ఎగ్గొట్టిన 20 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే సైన్యానికి వెచ్చిస్తున్న డబ్బు ఏమాత్రం?

పోనీ నాలుగేళ్లు కాంట్రాక్టు ప్రాతిపదికన సైన్యంలో పనిచేసి  బయటకు వచ్చిన వ్యక్తి తర్వాత ఉద్యోగం రాకపోతే ఏంచేయాలి*?తుపాకీలతో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి రాజకీయ ప్రత్యర్ధులను అంత మొందించేందుకు,దోపిడీలకు పాల్పడే అసాంఘిక శక్తులకు సహాయపడే అరాచకవాదులు గా మారే ప్రమాదం లేదా?

వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు, దేశ భక్తికి స్ఫూర్తిని కలిగించేలా ప్రభుత్వం రక్షణ విధానం ఉండాలి.

   

Post a Comment

0 Comments