GET MORE DETAILS

విదేశాల నుండి వచ్చేటప్పుడు మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు ?

విదేశాల నుండి వచ్చేటప్పుడు మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు ?



విదేశాల నుంచి వచ్చే వాళ్లు బంగారాన్ని భారత్‌కు తెచ్చుకోవచ్చు. ఇది చట్ట విరుద్ధం ఏమీ కాదు. అయితే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మీర ఎంత బంగారాన్ని తీసుకువస్తున్నారు? కస్టమ్స్ డ్యూటీ చెల్లించారా? లేదా? ఎంత కాలం నుంచి విదేశాల్లో ఉన్నారు? అనే అంశాలను గమనిస్తారు. విదేశాల్లో ఏడాదికి పైగా నివాసం ఉండి స్వదేశానికి వస్తూ ఉంటే.మగ వారు అయితే ఎలాంటి సుంకం కట్టకుండానే 20 గ్రాముల వరకు (రూ.50 వేలు దాటకూడదు), అదే మహిళలు అయితే 40 గ్రాముల వరకు (విలువ రూ.లక్ష దాటకూడదు) తెచ్చుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే అప్పుడు అదనపు బంగారంపై 13.75 శాతం సుంకం చెల్లించాలి.

అదే విదేశాల్లో 6 నెలల నుంచి ఏడాదిలోపు ఉన్న వారు వస్తే.. అప్పుడు బంగారంపై ట్యాక్స్ పడుతుంది. ఎలాంటి మినహాయింపులు ఉండవు. 13.75 శాతం సుంకం చెల్లించాలి. అలాగే విదేశాలకు వెళ్లిన వారు అక్కడ ఆరు నెలల కాకుండానే తిరిగి వచ్చేటప్పుడు బంగారం తెచ్చుకుంటే.వీళ్లకు కూడా మినహాయింపు ఉండదు. అంతేకాకుండా వీరిపై అధిక ట్యాక్స్ పడుతుంది. 38.5 శాతం సుంకాన్ని చెల్లించుకోవాలి. పిల్లలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అంతేకాకుండా బంగారం బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ వంటి వాటిని తెచ్చుకోవడానికి వీలు లేదు. కేవలం గోల్డ్ జువెలరీ రూపంలో మాత్రమే పైన పేర్కొన్న లిమిట్ వరకు అనుమతి ఉంటుంది.

Post a Comment

0 Comments