Ads Area

న్యాయాన్ని ప్రజల గడపకు చేర్చాలి: సీజేఐ జస్టిస్ ఎన్. వి. రమణ

0

న్యాయాన్ని ప్రజల గడపకు చేర్చాలి: సీజేఐ జస్టిస్ ఎన్. వి. రమణ



ఈ దేశంలో చాలా మంది ప్రజలు న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం తొలిసారిగా జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ''న్యాయ ప్రక్రియలో చాలా మంది ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే. న్యాయస్థానాలపై ప్రజల అభిప్రాయం.. జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుంచి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో న్యాయవ్యవస్థలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలగాలి. అలా చేర్చగలిగితే మనమంతా న్యాయమూర్తులు, లాయర్లు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేయాలి'' అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా దేశ యువతపై సీజేఐ ప్రశంసలు కురిపించారు. ''ఈ దేశ నిజమైన బలం యువతలోనే ఉంది. ప్రపంచంలో ఐదో వంతు యువత మన దేశంలోనే ఉంది. అయితే మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. మిగతావారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలి'' అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area