GET MORE DETAILS

చాయ్‌లో చక్కెర మంచిదా? బెల్లం మంచిదా? ఏది వాడితే ఆరోగ్యం

 చాయ్‌లో చక్కెర మంచిదా? బెల్లం మంచిదా? ఏది వాడితే ఆరోగ్యం


ఇంటికి ఎవరైనా అతిథులు రాగానే చాయ్‌ ఆఫర్‌ చేయడం గౌరవంగా భావిస్తుంటాం. బయటకు వెళ్లిన సమయాల్లో ఓ కప్పు టీ తాగితే ఎంతో రిలీఫ్‌. చాయ్‌ మనకున్న అనుబంధం అలాంటిది. చాయ్ ప్రియులు సాధారణంగా రోజుకు 5 కప్పుల కన్నా ఎక్కువగానే చాయ్ తాగుతుంటారు. అయితే చాయ్ తాగినప్పుడల్లా దానిలోని చక్కెర మన శరీరంలోకి వెళ్లి అధికంగా క్యాలరీలు చేరేలా చేస్తుంది. దీంతో బరువు అధికంగా పెరుగుతాం. అలాగే, చక్కెర తయారీకి వాడే రసాయనాల కారణంగా మనం వివిధ వ్యాధులకు కూడా గురవుతున్నాం. అయితే, టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే ఈ ముప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇదే సమయంలో బెల్లంతో ఆరోగ్యకర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

◆ బెల్లంలో 40-60% సుక్రోజ్ ఉంటుంది, 30-40% నీరు, 20-25% ఇన్వర్టెడ్ షుగర్ ఉంటుంది.100 గ్రాముల బెల్లంలో 358 కెలరీలు, 27 మిల్లీ గ్రాముల సోడియం, 53 మిల్లీ గ్రాముల పొటాషియం, 0.22 శాతం క్యాల్షియం, 32 శాతం ఐరన్, 85 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే బెల్లంను ‘లిక్విడ్‌ గోల్డ్‌’ అని చెఫ్‌లు పిలుస్తుంటారు.

◆ బెల్లంలోని యాంటీ అలర్జిక్‌, బాడీ టెంపరేచర్‌ రెగ్యులేఇంగ్‌ లక్షణాలు ఆస్తమా, బ్రాంకైటిస్‌ నివారణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

◆ వీటిలోని మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్ అయిన పొటాషియం, జింక్‌, సెలీనియంలు ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ను అడ్డుకుని శరీరానికి ఇన్‌ఫెక్షన్లు తట్టుకునే శక్తిని ఇస్తాయి.

◆ జీర్ణక్రియలో ఎంజైమ్‌ల విడుదలలో బెల్లం చురుకైన పాత్ర పోషించి రక్తహీనత, అజీర్తి సమస్యలు, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అందుకని నిత్యం బెల్లంతో చేసిన చాయ్‌ తాగడం అలవాటు చేసుకోవాలి.

◆ బెల్లం తినడం వల్ల మహిళల్లో హ్యాపీ హార్మోన్లు విడుదలై బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పులను తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

◆ మలబద్దకంతో బాధపడేవారికి బెల్లంతో చేసిన టీ తాగడం వలన ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

◆ బెల్లం బ్లడ్‌ ఫ్యూరిఫయర్‌లా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. శరీరంలో హిమగ్లోబిన్‌ పరిణామాన్ని కూడా పెంచుతుంది.

◆ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు చాయ్‌లో బెల్లం కలిపి ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

◆ టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లంను కూడా చేర్చుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, అలర్జీలు తగ్గుతాయి.

బెల్లం మంచి చేస్తుంది కదా అని ఎక్కువగా తిన్నారో అసలుకు మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లం ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి. కొన్ని రకాలు ఇన్ఫెక్షన్లు రావటంతో కడుపు నొప్పి వస్తుంది. రోజూ బెల్లం తక్కువ పరిణామంలో తీసుకునేలా చూసుకోవాలి. బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని బెల్లంతో చేసిన స్వీట్లు పెద్ద మొత్తంలో లాగించారో అనారోగ్యంపాలవుతారని మరిచిపోవద్దు.

Post a Comment

0 Comments