ప్రచురణార్థం - దేశవ్యాప్తంగా NEP-- 2020 మరియు CPSవిధానం ని రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ లో చలో పార్లమెంట్ : STFI పిలుపు
అత్యంత అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించాలని, కంట్రీ బ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి ,పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI) డిసెంబర్ నెలలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని, ఈ పిలుపుని ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని STFI జాతీయ అధ్యక్షులు KC హరి కృష్ణన్, జాతీయ ప్రధాన కార్యదర్శి CN భారతి కోరారు.
కలకత్తాలో 27,28 సెప్టెంబర్ లో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం చేసినట్లు తెలియజేశారు. ప్రజాస్వామ్య దేశం లో ప్రజలందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. దీనికి భిన్నంగా NEP 2020 ద్వారా విద్య కార్పొరేట్ల కు అప్పచెప్పడం వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే విద్య,పేదవర్గాలు విద్యకు దూర మయ్యే ప్రమాదం వున్నదని తెలిపారు. ఇప్పటికే బడిఈడు కలిగిన విద్యార్థులు 2కోట్ల మంది బడిబైట ఉన్నారని ప్రభుత్వం చెబుతుందని,ఈ NEP 2020 అమలు జరిగితే మరో 2 కోట్ల మంది విద్యకు దూరం కావడం తో పాటు,భవిష్యత్ లో కొన్ని వర్గాలు పాఠశాలల గడపకు కూడా రాని పరిస్టితులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పేరుతో కుల వ్యవస్థను ఘనీభవించేట్లు ఈ విద్యా విధానం ఉందని, ఇది రాజ్యాంగ లక్ష్యాలను అయిన భిన్నత్వంలో ఏకత్వం ,లౌకిక విధానం, ప్రజాస్వామ్య అంశాలను సైతం విస్మరించిందని విమర్శించారు. తక్షణం NEP 2020 ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలిపెట్టి ప్రపంచీకరణలో భాగంగా 2004 నుండి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని, దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక నష్టంతోపాటు, ఉద్యోగ విరమణ తర్వాత జీవనం సాగించడానికి కావలసిన ఆర్థిక సహకారం కూడా ఉండదని,ఇది అత్యంత దారుణమైన అంశమని విమర్శించారు. CPS రద్దు పై పోరాటాలు చేస్తున్నా,సిపిఎస్ ని రద్దు చేయమని.. చెప్పటం ఉద్యోగ ,ఉపాధ్యాయ హక్కుల్ని కాలరాయడమే అని విమర్శించారు . సిపిఎస్ వల్ల ప్రభుత్వాలకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, కార్పొరేట్లకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూరుస్తుందని తెలియజేశారు. కార్పొరేట్ల లాభం కోసమే ప్రవేశపెట్టబడిన సిపిఎస్ ని రద్దుచేసి,ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలాగే ప్రభుత్వానికి ఉపయోగపడే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో STFI జాతీయ స్థాయి నాయకత్వం తో పాటు యూటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు N. వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాధ్యక్షురాలు AN కుసుమకుమారి,రాష్ట్ర కార్యదర్శి A. అరుణకుమారి పాల్గొన్నారు.
0 Comments