GET MORE DETAILS

కార్తీక మాసం 30 రోజులు - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం

కార్తీక మాసం  30 రోజులు  - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం




1వ రోజు 

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు

దానములు : నెయ్యి, బంగారం

పూజించాల్సిన దైవము :స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము : ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా


2వ రోజు

నిషిద్ధములు : తరగబడిన వస్తువులు

దానములు : కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము : బ్రహ్మ

జపించాల్సిన మంత్రము : ఓం గీష్పతయే - విరించియే స్వాహా


3వ రోజు

నిషిద్ధములు : ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు : ఉప్పు

పూజించాల్సిన దైవము : పార్వతి

జపించాల్సిన మంత్రము : ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా


4వ రోజు

నిషిద్ధములు :  వంకాయ, ఉసిరి

దానములు : నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము : విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా


5వ రోజు

నిషిద్ధములు : పులుపుతో కూడినవి

దానములు : స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము :  ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము : (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)


6వ రోజు

నిషిద్ధములు : ఇష్టమైనవి , ఉసిరి

దానములు : చిమ్మిలి

పూజించాల్సిన దైవము : సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము : ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా


7వ రోజు

నిషిద్ధములు : పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు : పట్టుబట్టలు, గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము : సూర్యుడు

జపించాల్సిన మంత్రము : ఓం. భాం. భానవే స్వాహా


8వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు : తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము : దుర్గ

జపించాల్సిన మంత్రము : ఓం - చాముండాయై విచ్చే - స్వాహా


9వ రోజు

నిషిద్ధములు : నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు : మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము : అష్టవసువులు -

పితృ దేవతలుజపించాల్సిన మంత్రము :  ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః


10వ రోజు

నిషిద్ధములు : గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు : గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము : దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము : ఓం మహామదేభాయ స్వాహా


11వ రోజు

నిషిద్ధములు : పులుపు, ఉసిరి

దానములు : వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము : శివుడు

జపించాల్సిన మంత్రము : ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ


12వ రోజు

నిషిద్ధములు : ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు : పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము : భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము : ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా


13వ రోజు

నిషిద్ధములు : రాత్రి భోజనం, ఉసిరి

దానములు : మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము : మన్మధుడు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా


14వ రోజు

నిషిద్ధములు : ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు : నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము : యముడు

జపించాల్సిన మంత్రము : ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా


15వ రోజు

నిషిద్ధములు : తరగబడిన వస్తువులు

దానములు : కలువపూలు, నూనె, ఉప్పు 

జపించవలసిన మంత్రం : 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


16వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల

దానములు : నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము : స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము : ఓం స్వాహాపతయే జాతవేదసే నమః


17వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు : ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము : అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము : ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా


18వ రోజు

నిషిద్ధములు : ఉసిరి

దానములు : పులిహార, అట్లు, బెల్లం

పూజించాల్సిన దైవము : గౌరి

జపించాల్సిన మంత్రము : ఓం గగగగ గౌర్త్యె స్వాహా


19వ రోజు

నిషిద్ధములు : నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు : నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము : వినాయకుడు

జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా


20వ రోజు

నిషిద్ధములు : పాలు తప్ప - తక్కినవి

దానములు : గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము : నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము : ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం


21వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు : యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము : కుమారస్వామి

జపించాల్సిన మంత్రము : ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా


22వ రోజు

నిషిద్ధములు : పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు : బంగారం, గోధుమలు, పట్టుబట్టలు

పూజించాల్సిన దైవము : సూర్యుడు

జపించాల్సిన మంత్రము : ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా


23వ రోజు

నిషిద్ధములు : ఉసిరి, తులసి

దానములు : మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము : అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా


24వ రోజు

నిషిద్ధములు : మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు : ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము : శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము : ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా


25వ రోజు

నిషిద్ధములు : పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు : యథాశక్తి

పూజించాల్సిన దైవము : దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము : ఓం ఈశావాస్యాయ స్వాహా


26వ రోజు

నిషిద్ధములు : సమస్త పదార్ధాలు

దానములు : నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము : కుబేరుడు

జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా


27వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు : ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము : కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా


28వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు : నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము : ధర్ముడు

జపించాల్సిన మంత్రము : ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా


29వ రోజు

నిషిద్ధములు : పగటి ఆహారం, ఉసిరి

దానములు : శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము : శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము : ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్


30వ రోజు

నిషిద్ధములు : పగటి ఆహారం, ఉసిరి

దానములు : నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము : సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

Post a Comment

0 Comments