GET MORE DETAILS

అధిక మరియు ఆల్ప రక్తపోటుతో బాధపడే వ్యక్తులు తీసుకోవాలిసిన పండ్లు

అధిక మరియు ఆల్ప రక్తపోటుతో బాధపడే వ్యక్తులు తీసుకోవాలిసిన పండ్లు



పండ్లు వంటి మంచి ఆహారము తీసికొవాలన్న తలపురావడమేగొప్ప. తక్షణము మీ అందుబాటులోవున్న ఏ పండు అయినా నిరభ్యంతరముగా తీసికోండి.

పళ్ళు / ఫలములు ఎందుకు మంచిదంటే వాటిలో నీటి శాతము చాలా ఎక్కువ , మనముతినే మిగిలిన ఆహారాలతో పోల్చి చూస్తే! అంటే పూరీలూ సున్నివుండ అన్నము అయిస్ క్రీం ఇలా మనము తినే ఆహారపదార్ధాలకన్నా పళ్ళు / ఫలాలలో నీరు పీచుపదార్ధము ఎక్కువగా వున్నందున ఇంధన శక్తి లేదా కాలరీలు తక్కువగావుంటాయి! పొట్ట నిండేంత తిన్నా , "అంత" మామూలు ఆహారము కన్నా తక్కువ మనకి కాలరీలు ఇచ్చి మనల్ని వూబకాయం పెరగకుండా రక్షణ ఇస్తున్నాయి.

అంతేకాక వైటమినులూ , మినర్ల్సూ , పోషకపదార్ధములు కలిగి ఒక్కో పండు ఒక్కో తీరున విలక్షణంగా వుండి మనకు మంచి చేస్తున్నాయి! ముఖ్యముగా మెగ్క్గామెగ్నీషియం వున్న పళ్ళు మరీముఖ్యముగా చాలా సహాయకారులావుంటాయి రక్తపోటు తగ్గడానికి!బొప్పయ కాయ , అరటిపండు , జామ ,పూటపండు పంబరపనస / దబ్బ. ఇంకా కివీ బ్లాక్బెర్రీ రాస్ప్బెర్రీ, అవకాడో ఇలా ఎన్నో...!

కొన్నిపళ్ళు మామిడి అనాస కర్జూరము అరటి ద్రాక్ష వంటి పళ్ళలో బాగావొళ్ళు వచ్చే గుణముంటుంది !ఎందుకంటే అందులో కాలరీలు బాగా ఎక్కువకాబట్టి ! వీటిని జాగ్రత్తగా మితంగా తగుమోతాదులో సేవించాల్సి వుంటుంది.

పళ్ళరసాల జోలికి , డబ్బాలలో సీలుచేసికొన్న ముక్కలు ,పళ్ళ కాన్సంట్రఏట్ , పళ్ళవరుగులు , ఇలాంటివి మీ భోజనము లోంచి పూర్తిగాతుడిచివేయండి ! వీటివల్ల జరిగే చెడు చెప్పనలవికానంత!!" కొబ్బరినీళ్ళు " అందునా తాజాకొబ్బరి బొండాములోవి ధారాళముగా తీసికోవచ్చు (సీసా లోవి కావు ) ఎండుద్రాక్షవంటి ఎండిన ఫలాలను తీసికోవాలంటే 30 గ్రాములు రోజుకి మించకుండాచూసుకోండి !రోజులో తాజాపళ్ళు 150 గ్రాములవరకు తీసికొనవచ్చు.

ఇతర వ్యాధులు రక్తపోటుతో కలసి వున్నట్లయితే పై సంభాషణ వర్తించదు ! మూత్రపిండాలు సరిగాపనిచేయకపోతే పొటాషియం వున్నపళ్ళు తిన వలదు , రక్తపోటుతో పాటు మధుమేహం వుంటే పళ్ళు ధారాళలంగా ఏవిపడితే అవి తినకూడదు! మీ మీ ఆరోగ్య / అనారోగ్యాలని గూర్చి పూర్తిగా తెలుసుకోండి. పళ్ళుమంచివి తీసికొంటున్నానుగనుక ఎంతయినా జంక్ ఫుడ్ తినేయవచ్చు అనే దురభిప్రాయాన్ని మానుకోండి. పళ్ళు/ ఫలాలు కేవలం ఒక ఆహారపదార్ధము మాత్రమే! ఔషదము కాదు , మాయామంత్రము చేయలేవు! మన దైనందిక జీవితములో తగుమోతాదులో సమతుల్యమైన ఆహారము , క్రమముతప్పని వ్యాయామము మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికచింతన తగిన హాబీలు ఇవన్నీముఖ్యము మీ రక్తపోటుని చక్కగాఅదుపు చేసుకోవడానికి!

చివరిమాట : పళ్ళలో కొన్నిమేలయినవే అయినా , రక్తపోటు వున్నవారు అన్నిరకముల పండ్లు / ఫలములనూ తమ ఆహారములో తగుమాత్రము , కేవలం తగుమాత్రము తీసికొనవచ్చును. పళ్ళరసాలు, పళ్ళగుజ్జు /తియ్యనిద్రావకాలు నిలవ వున్న దబ్బాలలోని పళ్ళముక్కలూ వీటికి దూరంగా వుండండి! ఎంతమంచివైనా పళ్ళు తగు పాళ్ళలో ఔషధ సమానము

అల్ప రక్తపోటు ని అధిగమించడానికి ఏవైనా మార్గాలు :

అల్ప రక్తపోటు అంటే అవయవాలకు తగినంత రక్తం అందకపోవడం అని అర్థం. చాలా సమయం మేర యిలా జరిగితే, ఇది తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుంది. షాక్, స్ట్రోక్, గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యంలాంటి వాటిలో ఏదైనా జరగవచ్చును.

రక్తపోటును పెంచడానికి మీ జీనవశైలిలో ఈ క్రింది మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

1. ఉప్పు వాడకం కొద్దిగా పెంచండి :

తక్కువ రక్తపోటు ఉన్నవారు రక్తపోటు* పెంచడంలో సహాయపడటానికి సోడియం మితంగా పెంచడం గురించి ఆలోచించాలి.

2. మద్య పానీయాలకు దూరంగా ఉండాలి :

ఆల్కహాల్ రక్తపోటును మరింత తగ్గిస్తుంది, కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు మద్యం సేవించకుండా ఉండాలి.

3. వైద్యులతో మందుల గురించి చర్చించండి :

తక్కువ రక్తపోటు అనేది వివిధ రకాల మందుల దుష్ప్రభావం వలన కూడ వస్తుంది. అల్ప రక్తపోటు యొక్క లక్షణాలు, మందులు ప్రారంభించిన తర్వాత ప్రారంభమైతే, వైద్యుడితో అల్ప రక్తపోటు లక్షణాలను గురించి చర్చించాలి.

4. నీరు త్రాగాలి :

ఎక్కువ నీరు త్రాగటం రక్త పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది, ఇది తక్కువ రక్తపోటుకు కారణమయ్యే కారణాలలో ఒకదాన్ని తొలగిస్తుంది.

5. చిన్న మోతాదులలో భోజనం తరచుగా తినండి :

రోజంతా చిన్న మోతాదులలో ఎక్కువసార్లు భోజనం చేయడం, వేళ ప్రకారం భోజనం చేయడం అల్ప రక్తపోటుకు సహాయపడుతుంది.

6. కుదింపు మేజోళ్ళు (stockings) ధరించండి :

కుదింపు మేజోళ్ళు వేసుకోవడం వలన కాళ్ళలో చిక్కుకున్న రక్తం మొత్తాన్ని తగ్గించటానికి సహాయపడతాయి, కాబట్టి రక్తాన్ని వేరే చోటికి మార్చవచ్చు.

తక్కువ రక్తపోటు ఉన్నవారిలో ఒక్కసారిగా వున్నపళాన కూర్చోవడం లేదా లేచి, నిలబడటం వలన తేలికపాటి తలనొప్పి, మైకము లేదా మూర్ఛ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆకస్మిక మార్పుకు గుండె తగినంత త్వరగా శరీరం ద్వారా రక్తాన్ని పంప్ చేయలేదు.కనుక అల్ప రక్తపోటు వున్నవారు వారి జీవనశైలిలో, పైన చెప్పబడిన మార్పులను చేసుకోగలిగితే సత్ఫలితాలను పొందుతారు.

Post a Comment

0 Comments