GET MORE DETAILS

గ్రహణ కాల ప్రత్యేక విధులు నిర్వహించండి...!

 గ్రహణ కాల ప్రత్యేక విధులు నిర్వహించండి...!



 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గాయత్రీ జపం చేయవచ్చా?

 స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా...? అక్కర్లేదా...?

ఇలా ఎన్నో ప్రశ్నలు. నిజానికి వీటికి సమాధానాలు చాలా మందికి తెలియవు. ఎక్కువ మంది గ్రహణకాల విధులు మరిచిపోయారు. కేవలం కొద్దిమంది సనాతనపరులు మాత్రమే వీటిని పాటిస్తున్నారు. కనుక తమ ప్రశ్నలకు సమాధానాలు కూలంకషంగా వివరణ :

గ్రహణం అంటే ఏమిటి ? గ్రహణ సమయం అంటే ఏమిటి ?

గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుడిని గ్రహంగా అంగీకరించరు. అది వేరేసంగతి. 

గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు. ఇవి స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు. 

ఉదాహరణకు కేతువు ద్వారా రాబోతున్న ఆశ్వయుజ సూర్యగ్రహణం స్పర్శకాలం 25వ తేదీన సాయంత్రం గం 5.04నిమిషాలు. మధ్యకాలం సాయంకాలం 5.39. ఇక గ్రహణం విడిచేది అయిన మోక్షకాలం సాయంత్రం 6.28. అయితే ఈ గ్రహణంలో మోక్షం సూర్యాస్తమయం తరువాత కలిగింది.  అరుదైన గ్రహణం. అక్టోబర్ 25వ తేదీని సూర్యాస్తమయం 5.36నకే జరుగుతుంది.

ముందుగా ఈ గ్రహణ సమయంలో స్వాతీ నక్షత్రం వారు సూర్యగ్రహణం, భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. తులారాశివారు సూర్యగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ?

ఇది మంచి ప్రశ్న. గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం.

కనుక అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథాపనుల్లో ఉండరాదు. ఇంద్రియలోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం సూర్య చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్యచంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు. 

గాయత్రీ జపం చేయవచ్చా ?

చేయవచ్చా కాదు. చేయాలి. చేసితీరాలి. గ్రహణవిముక్తి, మోక్షకాలం వరకూ చేస్తూనే ఉండాలి. కేవలం గాయత్రినే కాదు. ఎన్ని ఉపదేశాలు పొందితే ఆ మంత్రాలు అన్నీ జిపించాలి.

ఆచమనం చేయవచ్చా ?

ఇది మంచి ప్రశ్నే. గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. అయితే ఇది అందరికీ చెప్పలేదు. కేవలం కఠినమైన సాధనలు చేసే వారికి మాత్రమే చెప్పారు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. 

గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా ? అక్కర్లేదా ?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా లేక సూర్య/ చంద్ర ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?

కేతగ్రస్త సూర్యగ్రహణదినే గ్రస్తాస్తమయ గ్రహణకాలే రాహుగ్రస్త చంద్రగ్రహణ దినే గ్రస్తోదయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి.

Post a Comment

0 Comments