ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు...! అత్యధికంగా విజయనగరం జిల్లాలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత..!!
● ఎండలు బాగా పెరుగుతాయన్న వాతావరణ శాఖ.
● ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.
● చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.
◆ రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని వాతావరణ నివేదికలు వెల్లడించడం తెలిసిందే.
◆ అందుకు అనుగుణంగానే ఏపీలో ఎండ వేడిమి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయిలో నమోదవుతున్నాయి.
◆ రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. అత్యధికంగా విజయనగరం జిల్లా గుర్లలో 41.83 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
● నంద్యాలలోని ఆత్మకూరులో 41.7 డిగ్రీలు, ఏలూరు జిల్లా పూళ్ల వద్ద 41.11, బాపట్లలో 41,6, ప్రకాశం జిల్లా గోస్పాడులో 41.8, జంగారెడ్డిగూడెంలో 41.65.
● అనకాపల్లిలో 41.62, నెల్లూరులో 41.4, నంద్యాలలో 41.2, శ్రీ సత్యసాయి జిల్లాలో 41.29, అనంతపురంలో 41.03, మన్యం జిల్లా భామినిలో 40.93.
● విజయవాడలో 38.1, తిరుపతిలో 40.7, కడపలో 40.7, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 40.61 డిగ్రీలు నమోదయ్యాయి.
● ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 40.6, అల్లూరి జిల్లా కూనవరంలో 40.31, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 40.01, ఒంగోలులో 39.8, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 39.7.
● విశాఖలో 39.3, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 39.24, శ్రీకాకుళంలో 37.7, కాకినాడలో 37.2, కర్నూలులో 38.74, రాయచోటిలో 38.12 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
0 Comments