శని గ్రహ దోష పరిహార మార్గాలు
★ రావిచెట్టుకు ప్రదక్షిణలు , తలిదండ్రులను, గురువులను గౌరవించాలి, పూజించాలి. పేదవారికి, అవిటివారికి దానధర్మాలు చేయాలి.
★ కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
★ పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, తినడానికి గ్రాసాన్ని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
★ శుభాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఆలాగే ప్రతి రోజు విష్ణు సహస్ర నామలు చదవడం, లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది,
★ పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా కమ్మని రుచికరమైన భోజనాలు పెట్టించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
నీలం: శని వల్ల ‘నీలం' ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక అవసరమైతే తప్పక ధరించాలి.
వాకింగ్ : ఉదయం నడక సాగించాలి, శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి. సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.
నువ్వుల నూనె : శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానంచేయాలి. తడికాళ్ళతో నిద్రించరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది, బెడ్రూం, పరిశుభ్రంగా ఉండాలి. సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.
చీమలకు ఆహారం : శ్రమ జీవులు అయిన చీమలకు చెక్కెర వేయాలి. ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపించాలి. నల్ల కుక్కలకి కాకులకి ఆహారం వెయ్యాలి.
మెడిటేషన్: ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేయాలి. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం, వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశు పక్ష్యాదులకి సహాయం చేయాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.
కాళికాదేవి లేదా శివున్ని పూజించాలి. శని స్తోత్రం, శని చాలీసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. శివలింగాన్ని, కాళికాదేవిని పూజించాలి. పేదలకు భోజనం పెట్టడం చేయాలి.*
తరుణోపాయ మంత్రం :
ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమ:
కోణస్త పింగళ బభ్రు:
కృష్ణో రౌద్రాంతకో యమ:
సౌరి శనైశ్చరో మంద:
పిప్పలాదేవ సంస్తుత:
నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
ఆపదలు తొలగుటకు మంత్రం :
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః |
0 Comments