GET MORE DETAILS

పిల్లలకి జలుబు వచ్చి ముక్కు బ్లాక్ అయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడితే ఏమిచెయ్యాలి ?

పిల్లలకి జలుబు వచ్చి  ముక్కు బ్లాక్ అయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడితే ఏమిచెయ్యాలి ?



పిల్లలకి జలుబు వచ్చిందంటే చాలు ముక్కు బ్లాక్ అయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు తల్లులు వారికి విక్స్, బామ్స్ రాస్తుంటారు. అయినప్పటికీ అంతగా ఎఫెక్ట్ ఉండదు. అలాంటప్పుడు ఆవిరి పట్టండి. దీని వల్ల పిల్లలకి త్వరగా ఉపశమనం ఉంటుంది. దీని కోసం ఓ గిన్నెలో కొద్దిగా వేడి నీరు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, నీలగిరి తైలం వేయాలి. ఇప్పుడు వచ్చే ఆవిర్లని పిల్లలకి పట్టించాలి. ఇలా చేేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు తగ్గుతుంది. 

విశ్రాంతి చాలా అవసరం

దగ్గు, జలుబులతో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారిని ఎక్కువగా నిద్ర పోనివ్వండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలిసిపోయేలా చికాకు కలుగజేస్తుంది. పిల్లలు హాయిగా విశ్రాంతతి తీసుకుంటున్నప్పుడు వారిని ఇబ్బందిపెట్టే జలుబు త్వరగా తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో పిల్లలకి ఎక్కువ విశ్రాంతి అవసరం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. రోజూ కంటే ఎక్కువ సమయం వారు నిద్రపోయేలా చూసుకోండి. దీంతో చాలా వరకూ సమస్య తగ్గుతుంది.

వేడి నీటితో స్నానం

చలి వాతావరణం జలుబు ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కాబట్టి.. పిల్లలు ఉండే ప్రాంతం తేమగా కాకుండా ఉష్ణోగ్రత వేడిగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి వాతావరణంలో ఉంటే త్వరగా జలుబు తగ్గుతుంది. అదే విధంగా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని నీటితో స్నానం చేయించకండి.. స్నానానికి గోరువెచ్చని నీరు, వేడి నీటిని ఉపయోగించండి. దీని వల్ల జలుబు పెరగకుండా ఉంటుంది. పిల్లలకి కూడా ఉపశమనంగా ఉంటుంది.

పసుపు పాలు

వేడి పాలల్లో చిటికెడు పసుపు తాగిస్తే పిల్లలకు జలుబు నుంచి వెంటనే ఉపశమనం ఉంటుంది. కాబట్టి రోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలల్లో పసుపు వేసి తాగించండి. దీని వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

మిరియాల పాలు

అదే విధంగా మిరియాల పాలు కూడా పిల్లలకి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే, కొంతమంది పిల్లలు ఆ ఘాటుని తట్టుకోలేరు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి.. పిల్లలకు ఆ పాటు తాగించండి.

వేడి ద్రావణాలు

ఈ సమయంలో పిల్లలకి చల్లని ద్రావణాలు తాగించే బదులు.. వేడి వేడి ద్రావణాలు తాగేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు తగ్గుతుంది. నీరు కూడా గోరు వెచ్చని నీటినే తాగించడం మొదలుపెట్టండి. ఇలా చేయడం వల్ల త్వరగా జలుబు తగ్గుతుంది.

Post a Comment

0 Comments