GET MORE DETAILS

కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల

 కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల



రాష్ట్రంలో   352 కేజీబీవీలలో ఖాళీగా ఉన్న 1358 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. అయితే బాలికల విద్యను దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న మరో 197 పోస్టులు అదనంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పోస్టులకు గాను సుమారు 30 వేలమంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ పోస్టులకు గానూ 14వ తేదీన తాత్కాలిక మెరిట్ లిస్ట్ www.apcfss.kgbv.in వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది. తాత్కాలిక  మెరిట్ లిస్ట్ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15.06.2023 నుండి 16.06.2023 వరకు సంబంధిత పూర్వపు (13)జిల్లాల  డీఈవో కార్యాలయాల్లో అభ్యంతరాలు సమర్పించవలెను.  19.06.2023న తుది మెరిట్ జాబితా  జారీ చేయబడును.  20.06.2023 నుండి  21.06.23 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేసి,  జూన్ 22, 23, 24  తేదీల్లో మెరిట్ అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లో జిల్లా కమిటీల ద్వారా స్కిల్ టెస్ట్ నిర్వహించి 25.06.2023న కాంట్రాక్టు అగ్రిమెంట్ మరియు నియామక పత్రాలు జారీచేయబడును అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు తెలిపారు.

Post a Comment

0 Comments