GET MORE DETAILS

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - నెల్లూరు జిల్లా

 శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - నెల్లూరు జిల్లా



తెలుగుదేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో నెల్లూరులోని తల్పగిరి క్షేత్రం ఒకటి. ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది,17వ శతాబ్దం తరువాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది..

🔯 ఆలయంనకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవాహించు చున్నది.  దీనిని పినాకినీ నది అని కూడ పిలుస్తారు.  భక్తులు నదీ స్నానం  ఆచారించి దైవ దర్శనముకు బయులు దేరుతారు. ఇక్కడ విశాలమైన దేవాలయంలో శయనించి ఉన్న శ్రీరంగనాథస్వామి భక్తులపాలిటి కల్పతరువై ఉన్నాడు.

🔯 ఆది శేషువు శ్రీ మహా విష్ణువు ఆనతి మేరకు భూలోకంలో పవిత్ర పెన్నా నదీ తీరంలో గిరిగా నిలవగా స్వామి విశ్రాంతి తీసుకొంటున్నారు అన్న కారణం గా "తల్పగిరి " అన్న పేరు వచ్చినట్లుగా స్థానిక గాధల ఆధారంగా తెలుస్తోంది.

• రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.

🔯 పెన్నానది శ్రీ రంగనాథస్వామివారి పాదాలు కడుగుతున్నట్లుగా  ఆలయాన్ని ఆనుకొని ప్రవహించే నది సుందర దృశ్యం భక్తులకు నయనానందకరం గా ఉంటుంది.

🔯 తమిళభాషలో నెల్లి అంటే బియ్యం అని, ఊరు  అంటే గ్రామమని  అందుకే “నెల్లూరు మొలకొలుకులు” పండే ఈ బంగారు భూమిని నెల్లూరు గా పిలుస్తున్నారని చెపుతారు.        

తల్పగిరి:

💠 శ్రీ మహా విష్ణువు శ్రీ దేవి సమేతంగా భూలోకం లో విహరించాలని భావిస్తాడు. అయితే దీని కోసం అనువైన ప్రాంతం చూడాల్సిందిగా ఆది శేషుని ఆదేశిస్తాడు. అయితే శ్రీ మహా విష్ణువును క్షణకాలం కూడా విడిచి ఉండలేని ఆదిశేషుడు ప్రస్తుతం నెల్లూరు లోని పినాకిని గా పిలువబడే పెన్నా నది తీరం లో ఒక గిరిగా మారిపోయి తనపైకొంతసేపు విశ్రమించాల్సిందిగా కోరుతాడు. ఇది ఈ ప్రదేశంలో జరిగింది కనుక దీనికి తల్పగిరి రంగనాథ స్వామి క్షేత్రంగా పేరు రావడం జరిగింది.

🔯 తమిళదేశంలో శ్రీరంగంలో గల రంగనాథస్వామి వారి స్థానం ఆదిరంగమని, కన్నడ దేశంలోని శ్రీరంగపట్టణంలో గల స్వామివారు మధ్యరంగమని, నెల్లూరులో తల్పగిరి క్షేత్రంలో రంగనాథస్వామి వారు ఉత్తరరంగమని వైష్ణవ పండితుల భావం

స్థలపురాణం.

🔯 మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. 

మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.

గాలిగోపురం:

🔯 దీని ఎత్తు 95 అడుగులు ఉంటుంది. గాలిగోపురం ప్రత్యేకత ఏంటంటే.. దీని గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావన ఉంది అంటారు. రంగనాథుడి ఆలయం గాలిగోపురంపై కాకి వాలి.. పెన్నా నది నీటిని తాగితే.. కలియుగాంతం జరుగుతుందని అంటారు. అంటే అంత ఎత్తుకి పెన్నా నది నీరు వస్తే అప్పుడు జల ప్రళయం తప్పదని సంకేతం.

🔯 ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి.  గర్భాలయం నందు శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు.  

• స్వామి పాదాల వద్ద  శ్రీదేవి - భూదేవిని దర్శించవచ్చును. 

• గర్భాలయం చుటూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు.  

• ప్రదక్షిణ మండపం నందు ఉత్తర భాగంలో  శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము.  

🔯 గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో సర్వాంగ సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు. తూర్పు దిశగా చూస్తూ  కుడి చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని కనపడే స్వామి ఇక్కడ ఎడమ చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని పడమర దిశను చూస్తుంటారు.

🔯 గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

🔯 ఇక దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం అద్దాల మండపం. అద్దాల మండపంలో పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. మండపం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రపటం మనం ఎటునుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది. వటపత్ర శాయి రూరంలో ఉండే చిన్ని కృష్ణయ్య చిత్రాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించారు.

🔯 ఆలయానికి కుడివైపున ఉన్న ఉపాలయం లో శ్రీ మహాలక్ష్మీదేవి  దివ్యమంగళ విగ్రహం, శ్రీ రంగనాయకీదేవి భక్తుల  పూజలందుకుంటోంది.  

🔯 ఎడమ  వైపున ఉన్న ఉపాలయం లో “చూడు కుడిత్తునాచ్చియార్” గా భక్తులచే కొలవబడుతున్న శ్రీ గోదాదేవి కొలువు తీరి ఉంది. 

🔯పన్నిద్దరాళ్వారులను, శ్రీ ఆంజనేయుని ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు 

Post a Comment

0 Comments