పాఠశాల, కళాశాలల్లో సనాతన ధర్మ ప్రచారం - ఈ నెల 6న అన్నవరంలో ప్రారంభం - దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి
పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు సనాతన ధర్మ ప్రచారం నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన అన్నవరం దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులపాటు చుట్టుపక్కల ఉన్న దేవాల యాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవచనాలతో పాటు సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక కళాకారుల్ని ఇందులో భాగస్వాముల్ని చేసి పారితోషికాలు అందిస్తామన్నారు. సనాతన ధర్మం ప్రాశస్త్యాన్ని నేటి తరా నికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషన్ను త్వరలో ఏర్పాటు చేయ నున్నట్టు ప్రకటించారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 'తిరుపతి హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా ఉన్న అర్జు న్స్ పలు అక్రమాలకు పాల్పడినట్టు త్రిసభ్య కమిటీ ధ్రువీకరించింది. అత నిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది' అని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1,917 దేవాలయాల నిర్మాణాలు నవం బరు నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.
0 Comments