GET MORE DETAILS

భాద్రపద మాసం - శక్తి ప్రధానం

భాద్రపద మాసం - శక్తి ప్రధానం 



• చాంద్రమాన గణన ప్రకారం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి ‘భాద్రపద మాసం’ అని పేరు. ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు. 


• ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే సమయం ఇది. నూతన కార్యక్రమాలైన గృహారంభ, గృహ ప్రవేశ, వివాహాదులకు ఈ నెల పూర్తిగా నిషిద్ధం. 


• వానల ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల ప్రభావంతో అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో శక్తిహీనులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. 


• రోగ నిరోధకశక్తి ఉన్నవాళ్లు తట్టుకొని నిలదొక్కుకుంటారుఅందుకే, ఈ నెలలో అందరూ శక్తి ఆరాధన, జపాలు, ఉపాసన చేస్తూ ప్రకృతి వ్యతిరేక శక్తులను అధిగమించాలి.


• ఈ మాసంలో హరితాళిక, గణేశ చతుర్థి, రుషి పంచమి, లలితా షష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, అవిధ నవమి, దశావతార వ్రతం, పరివర్తిని ఏకాదశి, వామన ద్వాదశి, 


• అనంత పద్మనాభ చతుర్దశి, విషశహత మహాలయం వంటి అనేక వ్రతాదులు ఆచరించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది. ఈ వ్రతాలన్నీ తమను తాము తీర్చిదిద్దుకునేందుకు వినియోగించుకునేవే. 


• శారీరకంగా, మానసికంగా, ఆహార పరంగా లోపాలు రాకుండా కాపాడుకోవడమే వీటి ఉద్దేశం. ఈ వ్రతాలన్నీ పెద్దవే! నిర్వహణ కూడా శ్రమతో కూడుకున్నదే. 


• అయినా, భారతీయులు వీటిల్లో చాలా వ్రతాలను వారిప్రాంతాచారాలను బట్టి నిర్వహిస్తూనే ఉంటారు. మనసును రోగమార్గం, భోగమార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక 


• శక్తిమార్గంపై కేంద్రీకరించడానికే వ్రతాలు ఆచరించాలని సూచించారు పెద్దలు. తద్వారా శక్తిని పెంపొందించు కొని సమస్యలను అధిగమించవచ్చు.


• భాద్రపద మాసంలో భూమికున్న గురుత్వాకర్షణ శక్తికి, చంద్రుని ఆకర్షణ శక్తికి మధ్యవ్యత్యాసాలుఏర్పడుతాయి. వాటిని అధిగమించేందుకు గణేశ నవరాత్రులు నిర్వహిస్తుంటారు. 


• గణేశుడంటేనే భూమ్యాకర్షణ శక్తి. కొత్తదనం పేరుతో నవరాత్రుల లక్ష్యాన్ని మార్చేయడం బాధాకరం. కానీ, అసలు లక్ష్యం భూమితో సాన్నిహిత్యాన్ని పెంచుకొని గురుత్వాకర్షణశక్తిని ఉపాసించే అవకాశం కల్పిస్తాయి 


• వినాయక నవరాత్రులు. గణేశ వ్రత కథ కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా సూచన చేస్తుంది. చంద్ర ప్రభావం వల్ల భూమివాతావరణంతో పాటు మన మనస్సులు సంచలనం పొందుతాయి. కాబట్టి మరింతగా మూలశక్తి చైతన్యాన్ని ఉపాసించమని భాద్రపదం సూచిస్తుంది.


• భాద్రపద బహుళ పక్షం పితృదేవతల పక్షంగా చెబుతారు. తరలిరాని లోకాలకు వెళ్లిన మన పూర్వీకులను తలుచుకునే అవకాశం కల్పిస్తుంది భాద్రపదం. 


• పితృదేవతలను స్మరించుకుంటూ, వారికి ఉత్తమగతులు రావాలని కోరుతూ దానధర్మాలు చేస్తుంటారు. తగిన విధమైన సంప్రదాయ కర్మలు నిర్వర్తిస్తారు. మాసం చివరి రోజైన మహాలయ అమవాస్యనాడు పితరుల పేరుమీద శక్తిమేరకు దానధర్మాలు చేస్తుంటారు.


• లోక వ్యవహారంలో శుభకార్యాలకు పనికిరాని సమయాన్ని ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో దైవధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక జీవనమార్గంలో ముందుకుసాగాలి. 


• ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవాలి. వరుస శుభకార్యాలు ఉండే కాలంలో మనిషి దైవారాధనపై అంతగా దృష్టి సారించలేడు. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించు కోవడానికి శూన్య మాసాలే సరైనవని చెబుతారు పెద్దలు. 


• భాద్రపదం అలాంటిదే! దాదాపు శుక్లపక్షం అంతా వినాయక ఉత్సవాలతో ఆధ్యాత్మిక తరంగాలు వీధివీధినా ప్రసరిస్తుంటాయి. పితృదేవతా ఆరాధనతో కృష్ణ పక్షం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. 


• ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి అనువైన మాసంగా భాద్రపదం ప్రత్యేకతను సంతరించు కుంది. ఈ నెలలో శక్తిని ఉపాసిస్తూ శక్తిమంతులం అవ్వాలి. భారతీయ ధర్మం నిర్దేశించినట్టుగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడమే మనకు శ్రేయోదాయకం.

Post a Comment

0 Comments