వినాయక పూజలో తులసిని ఎందుకు వాడకూడదు అంటారు..!!
💠 గణపతి అర్చనకు తులసి పనికి రాదని చాలామంది చెబుతున్నారు. కానీ వినాయకచవితినాడు తులసి వేయవచ్చు - అని కొందరంటారు.
💠 అయితే వినాయక చవితి ఆ రోజు కూడా తులసి వేయరాదని చెబుతూ, 'వేయవచ్చు' అనే మాటకు ఎక్కడా ప్రమాణం లేదని కొంతమంది వాదన.
అసలు గణేశ చతుర్థినాడు తులసి వేయరాదా ?
💠 గణేశ విధానాలకు పరమ ప్రమాణమైన గ్రంథాలలో ఒకటి ముద్గల పురాణం. దానిలో స్పష్టంగా ఇలా చెప్పబడి ఉంది.
💠 ఒక ప్రత్యేక కారణంగా, తులసి తన అర్చనకు పనికిరాదని గణేశుని శాపం. అటుపై తులసి పశ్చాత్తప్తురాలై గణపతి అనుగ్రహం కోసం తపస్సు నాచరించింది.
💠 అప్పుడు గణపతి ప్రత్యక్షమై, తులసీదేవికి ఎన్నో వరాలనిచ్చి, 'వినాయక చవితినాడు మాత్రమే నీ దళాలతో నన్ను పూజించవచ్చు' అని అనుగ్రహించాడు.
"భాద్రశుక్లచతుర్య్థాం యే మహోత్సవ పరాయణాః ౹
పూజయిష్యంతి మాం భక్త్యా తత్ర త్వం ధారయామ్యహం ౹౹
ఏకవింశతి పత్రాణి హ్యర్చయిష్యంతి మానవాః ౹
తత్ర తే పత్రమేకం మే మాన్యం దేవి భవిష్యతి ౹౹
ఉల్లంఘన సమం పాపం న భూతం న భవిష్యతి"
💠 "భాద్రపదమాసంలో వచ్చే నా చవితి మహోత్సవాలలో సమర్పించే 21 పత్రాలలోకెల్లా తులసీపత్రమే అత్యంత గొప్పదిగా నేను స్వీకరిస్తాను.
💠 కనుక ఆ రోజున 21 పత్రాలలో తులసి పత్రం కూడా నాకు సమర్పించాలి. ఆ రోజున తులసిని సమర్పించకుండా పూజిస్తే, ఆ ఉల్లంఘన దోషానికి వారు పాపులుగానే పరిగణించబడతారు. అని వినాయకుడు వరం ఇచ్చాడు.
వినాయకచవితినాడు మాత్రమే తప్పకుండా తులసిని సమర్పించాలి.
0 Comments