GET MORE DETAILS

అమృత పురుషుడి ఆవిర్భావం

 అమృత పురుషుడి ఆవిర్భావం



ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడే దేవ వైద్యుడైన ధన్వంతరి జన్మించాడని చెబుతారు. అందుకే దీనిని ‘ధన్వంతరి త్రయోదశి’ గానూ సంబోధిస్తారు. మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని పురాణాల ద్వారా తెలుస్తున్నది. అమృతం కోసం దేవదానవులు పాలకడలి చిలుకుతుండగా మొదట హాలహలం వచ్చింది. దానిని పరమశివుడు స్వీకరించి, కంఠంలో నిలిపాడు. తర్వాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. చివరగా అమృత కలశం, ఔషధులు చేతబూని ధన్వంతరి ఆవిర్భవించాడు. అందుకే ధన్వంతరిని అమృత పురుషుడు అని పిలిచారు. ‘ధన్వంతరి’ అంటే చికిత్సకు లొంగని వ్యాధులను నశింపజేయువాడు అని అర్థం. వైద్య విధానాలను వివరించే 18 మహాగ్రంథాలను ధన్వంతరి లోకానికి అందించారని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ ధన్వంతరి మహా మంత్రము:

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ 

సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ 

త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్త్రే  శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప శ్రీ శ్రీ  ఔషధ చక్ర నారాయణ స్వాహా 

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే 

అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ

త్రైలోక్య నాథాయ శ్రీమహా విష్ణవే నమః

ఈ స్తోత్రము ప్రతి రోజూ చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు . 

ఎవరికైనా  అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు ఉన్న ఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన   ఆ రోగము ఉపశమించును. 

Post a Comment

0 Comments