GET MORE DETAILS

మన ఆరోగ్యం మన చేతుల్లో - ఆస్థమా (ఉబ్బసం) - నివారణామార్గాలు

 మన ఆరోగ్యం మన చేతుల్లో - ఆస్థమా (ఉబ్బసం) - నివారణామార్గాలు దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా మొదలైనవన్నీ శ్వాసవాళాలకి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే. ఆస్టమా లేక ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసవార సంబంధ వ్యాధి, ఉబ్బసానికి వయసుతో నిమిత్తంలేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. ఊపిరితిత్తులలో ఉండే చిన్న, పెద్ద శ్వాసనాళాలు బాగా ఉబ్బి పోతాయి. శ్వాసనాళాల పోతుంది. అందువలన లోపలిభాగంలో ఉండే జిగురు పొర నుండి నీరు స్రవించి పల్చబడి శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది ఎదురవుతుంది. ప్రత్యేకించి పీల్చినగాలి. త్వరగా బయటకురాదు. ఉబ్బసం దీర్ఘకాలిక వ్యాధి అయినా, ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు.. రలు తెరలుగా వస్తుంది. అప్పుడు ఊపిరి తిత్తులు బిగిసినట్లుగా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆయాసం వస్తుంది. ఒళ్ళంతా చెమటలు. పొస్తాయి. శరీరం చల్లబడిపోవచ్చు. శ్వాసనాళాల లోపలిపొరలు సంకోచించటం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతసమయం తర్వాత శ్వాస నాళాలు విపులీకరించుకుంటాయి. మనిషి తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాడు. ఇందుకు ఎంతసమయం పడుతుంది అనే దానికి నిర్దిష్టమైన సమాధానంలేదు. 

ఉబ్బసం ఎందుకు వస్తుంది అన్నదానికి కూడా నిర్దిష్టమైన సమాధానంలేదు. అయితే, చాలా సందర్భాలలో ఉబ్బసం వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి అని నిర్ధారణ అయింది. ఉబ్బసానికి మరొక ప్రధాన కారణం సరిపడనితత్వం అనబడే ఎలర్జీ తత్వం, దుమ్ము, ధూళి, పొగ, ధూమపానం, ఘాటైన వాసనలు, కాలుష్యవ్యర్ధాలు, చలివాతావరణం సరిపడకపోవటం మొదలయినవి ఉబ్బసానికి కారణం అని వైద్యపరంగా ఋజువయింది. అయితే, సరిపడక పోవటం అనేది అందరిలో ఒకేవిధంగా ఉండదు. ఒకరికి చలికాలంలో ఉబ్బసం వస్తే మరొకరికి  ఘాటైన వాసనల మూలంగా ఉబ్బసం రావచ్చు. కొందరికి ధూమపానం వలన ఉబ్బసం రావచ్చు.

అదేవిధంగా ఫుడ్ ఎలర్జీకూడా కొందరిలో ఉబ్బసానికి కారణం కావచ్చు. ఈ ఫుడ్ ఎలర్జీ కూడా మనిషి నుండి మనిషికి మారుతుంటుంది. దీనిని కనుక్కోవటం కూడా ఉదాహరణకు మాటలురాని పసిపిల్లవాడు ఒక పదార్థాన్ని తినటానికి ఇష్టపడకుండా ఆదే పని విసిరివేస్తుంటే ఆ పదార్థం అతనికి సరిపడదు అని అర్థం చేసుకోవాలి.

 ఉపయుక్త ఆహారం:

ఉబ్బసం వ్యాధికి ఆహారాన్ని ఎంపిక చేయటం కొంచెం కష్టతరమే. ప్రత్యేకింది. ఎలర్జీ తత్వం మొడిపడి ఉన్న ఉబ్బసం వ్యాధిగ్రస్థుల విషయంలో ఇది మరీ కష్టతరం. అందువలన ఉబ్బసం రోగుల విషయంలో ఏ ఆహారం పనికిరాదు అనే కోణం నుంచి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆక్రమంలో

1. ఏ పదార్ధం తీసుకుంటే ఉబ్బసం వస్తున్నదో. ఆ పదార్ధం లేదా పదార్ధాలను పూర్తిగా మాని వేయాలి.

2. నిల్వచేయబడిన పదార్థాలు, సూప్లు మానివేయాలి. ఎందుకంటే నిల్వ చేయబడే చాలా పదార్ధాలలో సల్ఫైట్ (sulphite) అనే పదార్ధం ఉంటుంది. ఇది ఒక ప్రిజర్వేటివ్, పదార్థం ఎక్కువకాలం నిల్వఉండటానికి, రంగు, రుచి మారకుండా ఉండటానికి ఇది వాడబడుతుంది. ఉబ్బసాన్ని ప్రకోపింపచేయటంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందువలన, నిల్వచేయబడిన పదార్ధాలకు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి. తప్పనిసరి అయినప్పుడు, నిల్వ పదార్ధాలపై ఉండే లేబుల్ను పరిశీలించి, దానితో సల్ఫైట్ లేక పోతేనే కొనుగోలు చేయాలి.

3. పులియబెట్టబడిన (ఫెర్మెంటెడ్) పదార్థాలకు దూరంగా ఉండాలి.

4. పొగత్రాగటం, మత్తుపానీయాలను సేవించటం మానేయాలి.

5. మసాలాదినుసులకు, తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి..

6. కడుపునిండా తినకూడదు. కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తిన్నా ఇబ్బంది లేదు. 

7. మంచినీరు ఎక్కువగా త్రాగాలి. ఉబ్బసం ప్రకోపించినప్పుడు, మరింతగా ఎక్కువనీరు త్రాగాలి.

 ఇంకా ఏమేమి...?

1. రోగ నిరోధకశక్తిని పెంచేది విటమిన్-సి. అందువలన విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే పండ్లు, కూరలు అవసరం (ఎలర్జీతత్వానికి లోబడి). ఆ క్రమంలో ప్రతిరోజు కనీసం ఒక సిట్రస్ పండు అయినా తప్పనిసరిగా తినాలి.

2. మాంసాహారులయితే ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలతో కూడిన చేపలను, కోడిమాంసాన్ని తీసుకోవచ్చు. శ్వాసనాళాలలోని జిగురు పొర పల్చబడకుండా ఉండటానికి కోడి మాంసం దోహదం చేస్తుంది.

మొత్తం మీద సమీక్షించుకుంటే ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు ఆహారం కొంచె సంక్లిష్టము, కష్టతరము అయినప్పటికీ ఆహారా విజ్ఞానంలో నిష్ణాతులైన వారి పరస్థిస్తులో (డైటీషియన్) అవసరమైన చర్మ, రక్త పరీక్షలద్వారా, ఏ వ్యక్తికి ఎటువంటి ఆహార పదార్థాలు సరిపడవో నిర్ధారించుకుని, అతని తత్వానికి సరిపడే ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

ఇంత శ్రమ ఎందుకని అల్లోపతి మందులను ఆశ్రయిస్తే ప్రస్తుతానికి ఉపశమనాన్ని ఇచ్చినా, వాటిని శాశ్వతంగా, జీవితకాలం నిరంతరాయంగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందువలన, భవిష్యత్తులో క్రొత్తరోగాలకు ఆస్కారం, అవకాశం ఉంటుంది.

ఉబ్బసానికి వాడే అల్లోపతి మందులు చాలా వరకు స్టెరాయిడ్ మందులు. వీటి వలన మంచితోబాటు కీడు కూడా జరుగుతుంది. (ప్రతి మందుకీ ప్రతికూల గుణాలు (side effects) ఉంటాయని అల్లోపతి వైద్యులే అంగీకరిస్తారు),

ఉదయం పూట వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి . రాత్రి నిద్రించే ముందు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి ముక్కలో వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు అవాల నూనె ఛాతీ మీద వ్రాయాలి, గోoతుకు వ్రాయాలి.

Post a Comment

0 Comments