GET MORE DETAILS

ఆరోగ్యం ఆనందం సంపద : చెడుకు బదులు మంచి ఆకర్షించండి

ఆరోగ్యం ఆనందం సంపద : చెడుకు బదులు మంచి ఆకర్షించండి



మీరు ఒక విషయాన్ని మంచి అనుకుంటారా చెడు అనుకుంటారా, అది మీకు కావాలా, అక్కర్లేదా అనేదాన్ని ఆకర్షణసిద్ధాంతం పట్టించుకోదు. అది మీ ఆలోచనలకి ప్రతిస్పందిస్తోంది. అందుకని మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాన్ని గురించి బాధపడుతున్నా, ఆ సంకేతాన్నే మీరు ఈవిశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు. "నాకింత అప్పు ఉండటం వల్ల నాకు చాలా బాధగా ఉంది.” ఈ విషయాన్ని మీకు మీరు ధ్రువీకరించు కుంటున్నారు. ఇక అదే మీకు ఎక్కువగా లభించబోతుంది.

ఆకర్షణసిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం. అది వ్యక్తిగతమైనది కాదు, అది మంచి, చెడులని విడదీసి చూడదు. అది మీ ఆలోచనలని గ్రహించి, వాటినే మీ జీవితానుభవంగా మీ దగ్గరకి వెనక్కి పంపుతోంది. ఆకర్షణసిద్ధాంతం కేవలం మీరు దేన్ని గురించి ఆలోచిస్తే దాన్నే మీకు అందిస్తుంది.

మీరు ఈరోజు నుంచి మంచినే ఆలోచించండి అంటే పాజిటివ్గా ఆలోచించండి నెగటివ్గా అస్సలు ఆలోచించవద్దు మీరు అనుకునే ప్రతి ఒక్క సెంటెన్స్ ను కూడా ఈ విశ్వశక్తి రిసీవ్ చేసుకుంటది. అది నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాది.

కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు గానీ లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు గానీ లేదా ఎవరితోనైనా చాటింగ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడడం నేర్చుకోండి. మీ నెగిటివ్ ఆలోచనల వల్ల మీ సమస్యను మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. యు ఆర్ ఏ క్రియేటర్. చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ పదాలు ఉచ్చరించండి చెప్పండి మాట్లాడండి ఆలోచించండి.

Post a Comment

0 Comments