GET MORE DETAILS

రోజూ ఎన్ని వేల అడుగులు వేయాలంటే...

రోజూ ఎన్ని వేల అడుగులు వేయాలంటే...



నడకతో మధుమేహం, గుండె జబ్బు వంటి జీవనశైలి వ్యాధుల నుంచీ రక్షించుకోవచ్చన్నది తెలిసిందే. అయితే రోజుకి ఎనిమిది వేల అడుగులు వేస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రనాడా పరిశోధకులు శాస్త్రపూర్వకంగా చెబుతున్నారు. గతంలో పది వేల అడుగులు వేస్తే మంచిది అని చెబుతూ వచ్చారు. కానీ తాజాగా లక్షమందిని పరిశీలించినప్పుడు - అంత అవసరం లేదనీ, ఏడు నుంచి తొమ్మిది వేల అడుగుల్లోపు నడవడం వల్లే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయనీ అంటున్నారు. కాస్త అటూ ఇటూగా ఎనిమిది వేల అడుగులు అంటే సుమారు 6.4 కిలోమీటర్లు నడిచినా చాలట.ఎందుకంటే పదివేల అడుగులు వేస్తే మంచిదన్న కారణంతో కొందరు కష్టంగా ఉన్నా ఆ నంబరు వచ్చేవరకూ నడుస్తున్నారు. అలా ఎక్కువ నడిస్తే నష్టం ఏమీ ఉండదు. కానీ అధిక బరువు ఉన్నవాళ్లు వేగంగా నడవలేరు. పైగా కష్టపడి నడవడం వల్ల గుండెమీద ఒత్తిడి పడుతుంది. అంతేకాదు, అంతా ఒక్కరోజులోనే ఈ సంఖ్యకు చేరుకోలేకపోవచ్చు. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలు పెట్టి నెమ్మదిగా పదిహేనురోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువు ఉన్నవాళ్లు వెయ్యితో మొదలు పెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని వివరిస్తున్నారు.

Post a Comment

0 Comments