GET MORE DETAILS

Tech Tip: ఎవరు పడితే వారు వాట్సప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయకూడదంటే ఏంచెయ్యాలి...?

Tech Tip: ఎవరు పడితే వారు వాట్సప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయకూడదంటే ఏంచెయ్యాలి...?



Whatsapp Tech Tip: వాట్సాప్‌లో కొందరు మన అనుమతి లేకుండా మనల్ని వేర్వేరు గ్రూపుల్లో యాడ్‌ చేసేస్తుంటారు. కొందరికి ఈ విషయం చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కొత్తగా చేరిన గ్రూప్‌లో ఇమడ లేక.. మొహమాటంతో గ్రూప్‌ నుంచి జారుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలా సమస్య తలెత్తకుండా వాట్సప్‌లో ఓ ఫీచర్‌ ఉంది. దాన్ని ఎనేబల్‌ చేసుకుంటే చాలు.. మీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త గ్రూప్‌ల్లో యాడ్‌ చేయడానికి వీల్లేదు. ఈ ఫీచర్‌ ఎలా ఎనేబుల్‌ చేయాలో చూద్దాం....

• వాట్సప్‌లోని పైన కుడివైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్‌ చేయండి.

• ‘Settings’ లోకి వెళ్లి ‘Privacy’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

• కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళ్లి ‘Groups’ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి.

• అందులో ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.వాటిల్లో ఎవ్రీవన్‌ కాకుండా మిగతా ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

• ఇకపై ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే మీకు ఇన్వైట్ లింక్‌ వస్తుంది.ఆ లింక్‌ను క్లిక్‌ చేసి గ్రూప్‌లో యాడ్‌ అవ్వొచ్చు.

గమనిక: వాట్సాప్‌లో వచ్చే లింక్స్, వెబ్‌ లింక్స్‌ను క్లిక్ చేసే ముందు తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం ఉత్తమం.

Post a Comment

0 Comments