మన ఆరోగ్యం మన చేతుల్లో - విరేచనంలో రక్తం పడటం తగ్గాలంటే...
మలబద్ధకం ఉండే వారిలో ఈ సమస్య తరచుగా వస్తూ ఉంటుంది. నీళ్ళు బాగా తక్కువగా త్రాగుతూ పచ్చళ్ళు, నాన్వెజ్ బాగా తినే వారిలో ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్ధం. లేని ఆహారం తినేవారిలో మలం గట్టిగా రాళ్ళలాగా మారుతుంది. ఈ గట్టి మలాన్ని బయటకు పంపడానికి దొడ్లో చాలా మంది ముక్కుతూ ఉంటారు. ముక్కేసరికి ఈ మలం ప్రేగుల అంచులను, రక్తనాళాలను చిట్లగొట్టుకుంటూ బయటకు వచ్చేసరికి ఆ మలం నుండి చెడ్డ సూక్ష్మజీవులు, హాని చేసే క్రిములు కోట్ల సంఖ్యలో పుడుతూ ఉంటాయి. ఆ క్రిములు ప్రేగుల వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఆ క్రిములు ఇన్ఫెక్షన్ వల్ల ప్రేగులలోని రక్తనాళాలు పగిలి రక్తం తరుచుగా పడుతుంది.
చిట్కాలు:
1) మంచినీటిని రోజుకు 5, 6 లీ॥ వరకూ త్రాగాలి. నీరు త్రాగినా విరేచనం సాఫీగా కాకపోతే 7, 8 రోజులు రోజూ ఎనిమా చేసుకోండి.
2) దొడ్లో మాత్రం ముక్కే ప్రయత్నం మానాలి. నీళ్ళు త్రాగి మనస్సు పెట్టి ప్రయత్నం చేసి, అర్జెంటుగా వెళ్ళాలనిపించే వరకు బయటే తిరిగి అప్పుడు వెళితే ముక్కవలసిన పని పోతుంది.
3) ప్రేగులలో మలబద్ధకం పోవడానికి, రోజూ కూరలను బాగా ఎక్కువగా పెట్టుకుని రొట్టెలతో తినడం మంచిది. రొట్టెలు తిన్నాక పెరుగన్నం తినవచ్చు. కూరగాయలకు తొక్కలు తీయకుండా లేతగా ఉన్నవాటిని వండుకోవాలి. సాయంకాలం కూడా ఇలానే తింటే మంచిది.
4) ఉదయం పూట కేవలం పండ్లను తింటే మంచిది. ఇలా 15, 20 రోజుల పాటు మొలక గింజలు మాని పండ్లతో ఉండడం మంచిది. పండ్లను కూడా పి ఊయకుండా మింగితే మంచిది.
0 Comments