వక్రాసనము
• వక్ర : వంకరగా, ఈ ఆసనం చివరి భంగిమలో శరీరం మెలితిరిగి వంకరగా వుంటుంది.
వక్రాసనం చేయు విధానం:
• కాళ్లు చాచి, రెండు మడమలూ కలిపి ఉంచి, చేతులు రెండు వైపులా నేలపై ఉంచి కూర్చోవాలి.
• కుడికాలు వంచి కుడిపాదాన్ని ఎడమ మోకాలి పక్కన ఉంచాలి.
• శరీరాన్ని కుడివైపు తిప్పి, ఎడమచేతిని కుడి మోకాలి పైనుంచి తీసుకు వచ్చి కుడిమోకాలి బొటనవ్రేలు పట్టుకోవాలి.
• కుడిచేతిని వీపు వెనుక ఉంచి, అరచేతిని నేలకు అదిమి ఉంచాలి. కుడివైపు చూస్తూ ఉండాలి.
• ఎడమ చేయిని వదిలివేసి మామూలుగా శరీరానికి ఎడమవైపు ఉంచాలి.
• కుడికాలిని మామూలుగా తీసుకుని మామూలు “స్థితి”కి రావాలి.
శారీరక లాభాలు:
• వెన్నుకు గట్టి తనము, శక్తి కలిగిస్తుంది. కాలేయానికీ, చిన్న ప్రేవులకూ, జీర్ణగ్రంథులకూ మంచి శక్తి నిస్తుంది.
ఆరోగ్య లాభాలు:
• మలబద్ధకం షుగరు వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, కాలేయానికి సంబంధించిన జబ్బులూ నడము కండరాల నొప్పి, తుంటి కీళ్ల నొప్పులూ అన్నీ పోతాయి.
ఆధ్యాత్మిక లాభాలు:
• బద్ధకం వదలి ఉత్సాహం వస్తుంది.
జాగ్రత్తలు:
• హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.
ముఖ్యాంశాలు:
• చివరి భంగమలో నడుము పైభాగం తిన్నగా ఉండాలి.
శ్వాస:
• కిందకు వంగే ప్రతీమారు ప్రక్కకు తిరిగేటప్పుడు, గాలి వెలుపలికి విడవాలి.
• పైకి లేచే ప్రతిసారి గాలి పీల్చాలి.
• చివరి భంగిమలో సాధారణముగా గాలిని పీల్చాలి.
గమనిక:
• ఏదైనా ఆసనాన్ని ఖాళీ కడుపుతో అభ్యసించడం ఉత్తమం
• ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.
• ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు
• యోగా నిపుణుడి శిక్షణలో ఈ ఆసనాన్ని చేయడం ఎల్లపుడూ మంచిది.
0 Comments