GET MORE DETAILS

మనసు ఏది ఊహించుకోగలదో, దాన్ని సాధించగలదు. డబ్ల్యూ. క్లెమెంట్ స్టోన్ (1902-2002)

మనసు ఏది ఊహించుకోగలదో, దాన్ని సాధించగలదు. డబ్ల్యూ. క్లెమెంట్ స్టోన్ (1902-2002)



రహస్యం నన్ను నిజంగా పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే నన్ను పెంచి పెద్దచేసిన మా నాన్న, ధనవంతులు అందర్నీ దోచుకున్నారనీ, డబ్బున్న వాళ్లందరూ ఎవరో ఒకర్ని మోసం చేసే ఉంటారనీ నమ్మే వ్యతిరేక మనస్తత్వం గల వ్యక్తి. అందుచేత నేను డబ్బు గురించి ఎన్నో నమ్మకాలతో పెరిగి పెద్దయాను మీ దగ్గర డబ్బుంటే మీరు చెడ్డ వ్యక్తి అని అర్థం, దుష్టుల దగ్గర మాత్రమే డబ్బుంటుంది, డబ్బు చెట్లకి కాయదు, వగైరా. "నేనేమైనా రాక్ఫెల్లరని అనుకుంటున్నావా?” అనేది ఆయనకి చాలా ఇష్టమైన వాక్యం. అందుకే, జీవితం చాలా కష్టాలతో కూడుకుని ఉంటుందని నేను నిజంగా చిన్నప్పుడు నమ్మేవాడిని. నేను డబ్ల్యు. క్లెమెంట్ స్టోన్ని కలుసుకున్నాకనే నా. జీవితాన్ని మార్చుకోవటం మొదలుపెట్టాను.

నేను స్టోన్ దగ్గర పనిచేస్తున్నప్పుడు, ఆయన, "నువ్వు ఒక గొప్ప లక్ష్యాన్ని. ఏర్పరచుకోవాలి. దాన్ని సాధించినప్పుడు నీ మనసు ఉప్పొంగి పోవాలి. నేను నీకు నేర్చిన విషయాలవల్లే నువ్వా లక్ష్యాన్ని చేరుకోగలిగావని నీకు తెలియాలి. అన్నాడు. ఆ రోజుల్లో నేను ఏడాదికి దాదాపు ఎనిమిది వేల డాలర్లు సంపాదించేవాడిని. అందుకని, "నేను ఏడాదికి లక్ష డాలర్లు సంపాదించాలని "అనుకుంటున్నాను." అని అన్నాను. అది ఎలా సాధిస్తానో నాకైతే తెలీదు. ఎటువంటి ఎత్తులూ, ప్రణాళికలూ నాకు తెలీవు. కానీ నేను మాత్రం, "నేను అలా అని ప్రకటించబోతున్నాను. అలా అని నమ్ముతున్నాను. అదే నిజమున్నట్టుగా అనుకుని పని చెయ్యబోతున్నాను. దీన్ని ప్రపంచంలోకి "పంపబోతున్నాను." అనుకున్నాను. అలా చేశాను కూడా.

ఆయన నాకు నేర్చిన విషయాలలో ఒకటి, రోజూ కళ్లు మూసుకుని, లక్ష్యాలని సాధించినట్టు ఊహించుకోవటం. నేను నిజంగానే ఒక లక్ష డాలర్ల నోటు తయారుచేసి గదిలో పైకప్పుకి అతికించాను. నేను నిద్ర లేవగానే మొట్టమొదటనాకు కనిపించేది అదే, అది నా ధ్యేయమని నాకది గుర్తుచేసేది. అప్పుడు నేను మళ్లీ కళ్లు మూసుకుని ఆ లక్ష డాలర్లు నా సొంతమైతే నా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకునేవాడిని. కానీ తమాషా, నెలరోజుల వరకూ ఏమీ జరగలేదు. నాకు అద్భుతమైన గొప్ప ఆలోచనలేవీ రాలేదు, నాకెవరూ ఎక్కువ డబ్బిస్తానని అనలేదు.

ఒక నాలుగు వారాలు ఈ రకంగా గడిచాక, నాకు లక్ష డాలర్లు సంపాదించేందుకు ఒక మార్గం తోచింది. అది అప్రయత్నంగా నా బుర్రలో మెరిసింది. నేను రాసిన పుస్తకం ఒకటి నాదగ్గరుంది. నాలో నేనిలా అనుకున్నాను, "ఆ పుస్తకం ఒక్కొక్కటీ డాలర్లో నాలుగోవంతు ధరకి, నాలుగు లక్షల కాపీలు అమ్మగలిగితే, నాకు లక్ష డాలర్లు లభిస్తాయి." ఆ పుస్తకం ఎప్పట్నించో అక్కడే ఉంది, కానీ నాకా ఆలోచన రాలేదు. (రహస్యాలలో ఒకటి, మీ మనసులోకి అనుకోకుండా వచ్చే ఆలోచనని మీరు నమ్మి, దాన్ని ఆచరణలో పెట్టాలి.) నాలుగు లక్షల కాపీలని ఎలా అమ్మాలో నాకు తెలీదుఅప్పుడు సూపర్అజారులో నాకు 'నేషనల్ ఎంక్వైరర్' కనిపించింది. దాన్ని నేను కొన్ని లక్షలసార్లు చూసి ఉంటాను, మనసు పొరల్లో ఎక్కడో అది అలా ఉండిపోయింది. హఠాత్తుగా అది ఒక్కదూకు దూకి నాముందు ప్రత్యక్షమైంది. "పాఠకులకి నా పుస్తకం గురించి తెలిస్తే, తప్పకుండా నాలుగు లక్షల నుంచి దాన్ని కొనుక్కుంటారు. " అనుకున్నాను.

ఆరువారాల తరవాత, న్యూయార్క్ లోని హంటర్ కాలేజిలో ఆరువందల మంది. అధ్యాపకుల ముందు నేను ఉపన్యాసం ఇచ్చాను. అది అయిపోయాక, ఒకామె నా దగ్గరకొచ్చి, "చాలా గొప్పగా మాట్లాడారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలని, ఉంది. నా కార్డిస్తాను, ఉండండి." అంది. అసలు విషయమేమిటంటే, ఆమె ఒక ఫ్రీలాన్స్ రచయిత్రి. తన కథలని 'నేషనల్ ఎంక్వైరర్'కి అమ్ముకుంటూ ఉంటుంది. నా బుర్రలో 'ద ట్వెలైట్ జోన్' (టి.వి. కార్యక్రమం) తాలూకు థీమ్ మోగసాగింది... భలే, ఇది నిజంగానే పనిచేస్తోందే! అనుకున్నాను. ఆ. ఇంటర్వ్యూ అచ్చయింది, అంతే నా పుస్తకం అమ్మకాలు మొదలైనాయి.

నేనిక్కడ చెప్పాలనుకుంటున్న విషయం, ఈ విభిన్నమైన సంఘటలన్నిటినీ నేను నా జీవితంలోకి ఆహ్వానించసాగాను, ఆ స్త్రీని కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, ఏడాది నేను లక్ష డాలర్లు సంపాదించలేదు. తొంభైరెండు వేల మూడువందల ఇరవైఏడు డాలర్లు సంపాదించాను. కానీ నేను నిరాశపడి, “ఇది పనిచెయ్యదు!" అనుకున్నానా? లేదు, "ఇది ఒక గొప్ప అద్భుతం!” అనుకున్నాను. నా భార్య నాతో, "లక్ష డాలర్ల విషయంలో ఇది పనిచేస్తే పదిలక్షల డాలర్లకి మాత్రం పనిచెయ్యదా?" అంది. "తెలీదు, చేస్తుందనుకుంటా. ప్రయత్నించి చూద్దాం." అన్నాను. 

నా ప్రచురణకర్త నా మొట్టమొదటి 'చికెన్ సూప్ ఫర్ ద సోల్' పుస్తకానికి రాయల్టీ చెక్కు రూపంలో ఇచ్చాడు. అంతే కాదు, అతను తన సంతకంలో ఒక నవ్వుమొహాన్ని గీశాడు. ఎందుకంటే పదిలక్షల డాలర్లకి అతను సంతకం చేసి ఇచ్చిన మొట్టమొదటి చెక్కు అదే.

అందుచేత, నా సొంత అనుభవం ద్వారా నేసే విషయాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే నేను బాన్ని పరీక్షించి చూసుకోవాలని అనుకున్నాను. ఈ రహస్యం నిజంగా పనిచేస్తుందా? దాన్ని పరీక్షించి చూశాం. అది చక్కగా పనిచేసింది. ఆ రోజునించి నేను నా జీవితంలోని ప్రతిరోజుల ఆనందాన్ని ఆరుకుంటున్నారు..

ఈ రహస్యం గురించిన జ్ఞానాన్నీ, ఆకర్షణ సిద్ధాంతాన్ని కావాలని ఉపయోగించుకోవటం. అనేదాన్ని, మీ జీవితంలోని ప్రతి ఒక్క విషయానికి అన్వయించుకోవచ్చు. మీరు సృష్టించుకోవాలనుకున్నది ఏదైనా, ప్రక్రియ మాత్రం ఒకటే, అందుకే డబ్బు అనే విషయం కూడా భిన్నమైనదేమీ కాదు.

డబ్బుని ఆకర్షించటానికి, మీరు సంపద మీద మనసు కేంద్రీకరించాలి. మీ దగ్గర డబ్బు అవసరమైనంత లేదనే విషయం గురించి అలోచించినంత కాలం, ఎక్కువ డబ్బు సంపాదించటం అసంభవం. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువగా లేదన్న ఆలోచనలే మీ మనసులో ఉన్నాయి. ఎక్కువ డబ్బు లేదన్న విషయంపై మనసు కేంద్రీకరిస్తే, డబ్బు ఎక్కువ. ఉందని పరిస్థితులే మరింతగా ఎదురవుతాయి. డబ్బు మీ దగ్గరకి రావాలంటే మీరు బోలెడంత డబ్బు గురించి ఆలోచించాలి.

మీ ఆలోచనలతో మీరు కొత్త సంకేతాన్ని విడుదల చెయ్యాలి. ఆ ఆలోచనలు మీ దగ్గర ప్రస్తుతం అవసరమైనదానికన్నా ఎక్కువ డబ్బుంది, అనేట్టు ఉండాలి. మీరు మీకున్న ఊహాశక్తినంతా వినియోగించి, మీకు కావల్సినంత డబ్బు మీ దగ్గరుందని అనుకోవాలి.

అది చాలా సరదాగా కూడా ఉంటుంది! మీ దగ్గర ఎక్కువగా డబ్బున్నట్టు నటించే ఆటలు అడగానే, మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి, అలా మంచి భావాలు కలగగానే, అది మీ జీవితంలోకి ప్రవహిస్తుంది.

జాక్ చెప్పిన ఈ అద్భుతమైన కథ ద సీక్రెట్ టీమ్ని ఒక సంతకం చెయ్యని బ్లాంక్ చెక్కు తయారుచేసి, ద సీక్రెట్ అనే వెబ్సైట్లో దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు పురికొల్పింది. ఆ చెక్కు మీకోసమే, అది బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ నుంచి మీకు అందుతుంది. అందులో మీరు మీ పేరు, పైకం, మిగతా వివరాలూ రాసి, రోజూకనిపించేచోట దాన్ని ఉంచండి. ఆ చెక్కుని చూసినప్పుడు, ఇప్పుడే ఆ డబ్బు మీకు కావాలని అనుకోండి. దాన్ని ఖర్చుపెడుతున్నట్టు, దాంతో మీరు కొనబోయే వస్తువులు గురించీ, చెయ్యబోయే పనుల గురించి ఊహించుకోండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించి చూడండి! అది మీదేనని తెలుసుకోండి, ఎందుకంటే మీరు అడిగితే, ఇక అది మీదే. ఈ సీక్రెట్ చెక్కుని ఉపయోగించుకుని పెద్దపెద్ద మొత్తాలని తమ దగ్గరకి తెచ్చుకున్నవాళ్ల గురించి వందలాది కథలు మాకు చేరాయి. ఇదొక సరదా ఆట, కానీపనిచేస్తుంది!!

Post a Comment

0 Comments