GET MORE DETAILS

ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్

 ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్



ఫిట్నెస్ ప్రియులకు ప్రొటీన్ పౌడర్ల విలు వేంటో తెలుసు. అయితే మార్కెట్లో వేల రూపా యల ఖరీదైన ప్రొటీన్ పౌడర్లను కొనే బదులు, తక్కువ ఖర్చుతో ఇంట్లో కూడా తయారు చేసు కోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు: 

• బాదం: 1 కప్పు,

• వాల్ నట్: అర కప్పు,

• పిస్తా పావు కప్పు,

• జీడిపప్పు: పావు కప్పు,

• గుమ్మడి విత్తనాలు: 2 టేబుల్ స్పూన్లు,

• పుచ్చ విత్తనాలు: 2 టేబుల్ టీస్పూన్లు,

• పొద్దు తిరుగుడు విత్తనాలు: 2 టేబుల్ స్పూన్లు,

• ఓట్స్: అర కప్పు,

• షియా విత్తనాలు: 2 టేబుల్స్పూన్లు,

• పాల పొడి: అర కప్పు (తీపి లేనిది)

తయారీ విధానం:

• బాదం పప్పును చిన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి.

• అదే ప్యాన్లో పిస్తా. వాల్నట్, జీడిపప్పు కలిపి వేయించి, పక్కన పెట్టుకోవాలి.

• గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి, సువాసన వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి.

• ఇవన్నీ చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. వీటి నుంచి నూనె వెలువడకుండా పల్స్, బ్లెండ్ మోడ్లను మారుస్తూ ఉండాలి.

• ఈ పొడిని జల్లించుకుని, పాల పొడి కలుపు కుంటే ప్రొటీన్ పౌడర్ తయారైనట్టే.

• ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని, రెండు నెలల లోపు వాడుకోవాలి.

• ప్రొటీన్ మిల్క్ కోసం రెండు కప్పుల పాలను వేడి చేసి, తయారుచేసి పెట్టుకున్న ప్రొటీన్ పౌడర్ 3 స్పూన్లను వేసి బాగా కలుపుకోవాలి.

Post a Comment

0 Comments