GET MORE DETAILS

చెడు కొలెస్ట్రాల్ కు టీకాతో చెక్

 చెడు కొలెస్ట్రాల్ కు టీకాతో చెక్


» గుండెజబ్బుల నియంత్రణలో విప్లవం

» ప్రపంచంలో 39% మందిలో సమస్యలు

» ఎల్డీఎల్ తో ఏటా 44 లక్షల మంది మృతి

 


గుండెజ బ్బులకు కారణమయ్యే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్-లో డెన్సిటీ లిపోప్రొటీన్)ను నియంత్రించేం దుకు తక్కువ ధరలోనే టీకా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఔషధాలతో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తున్నారు. పరిస్థితి చేదాటితే స్టెంట్స్ వేస్తున్నారు. అయితే వాటి స్థానంలో పరిశోధకులు వ్యాక్సిన్ను అభి వృద్ధి చేశారు. ఇది ఓ విప్లవాత్మకమైన ఆవిష్కరణగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరి శోధకులు ఈ టీకాను కనుగొన్నారు. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఈ టీకా విజయవంతంగా పనిజేసినట్లు ఎన్పీజే వ్యాక్సిన్స్ జర్నల్ కథనాన్ని ప్రచు రించింది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మేరకు.. ప్రపంచవ్యా ప్తంగా 39 శాతం మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడు తున్నారని తేలింది. అలాగే ప్రతీ ఏటా చెడు కొలెస్ట్రాల్తో 44 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని.. మొత్తం మరణాల్లో ఇది 8 శాతమని వెల్లడైంది.

టీకా ఎలా పనిచేస్తుందంటే...

ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు అటోర్వా స్టాటిన్ మెడిసిన్ ను వాడుతున్నారు. వైద్యుల సూచన మేరకు తగిన మోతాదులో రోజూ ఇది తీసుకోవాలి. అయితే తాజాగా కనుగొన్న టీకాను నెలకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. దాంతో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ శాతం 60 శాతం మేరకు తగ్గుతుందన్నారు. ఈ టీకా గుండెపోటు, బ్రెయి న్ స్ట్రోక్ రాకుండా కూడా నివారిస్తుందన్నారు. దీంతో మరణాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

సమస్యంతా చెడు కొలెస్ట్రాల్ తోనే...

మన రక్తంలో కొలెస్ట్రాల్ (హెచ్ఎఎల్- హైడెన్సిటీ లిపోప్రొటిన్).. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్-లోడెన్సిటీ లిపోప్రొటీన్) ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ రక్తం ద్వారా కాలేయానికి.. దాని ద్వారా ఇతర అవ యవాలకు కొలెస్ట్రాల్ను సరఫరా చేస్తుం టుంది. హెచ్ఎఎల్ కొలెస్ట్రాల్ ధమ నుల్లో చేరడమనేది చాలా తక్కువ. మన శరీరంలో హెచ్ఎఎల్ స్థాయులు 40కి పైగా ఉంటే మంచిది. చెడు కొలె స్ట్రాల్ ధమనులకు చేరి, వాటి గోడలకు అతుక్కుంటుంది. ఎక్కువగా అతుక్కుపో వడం వల్ల అథెరోస్క్లెరోసిస్కు దారితీస్తుంది. అంటే ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. గడ్డకట్టిన రక్తం విచ్చి న్నమై, గుండె, మెదడులోని ధమనికి సరఫరా నిలిచిపో తుంది. అది గుండెజబ్బులకు కారణమవుతుంది. శరీ రంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు 130లోపు ఉండాలి.

Post a Comment

0 Comments