GET MORE DETAILS

తెల్ల వెంట్రుకలు నల్లగా... ఇంటి చిట్కాలు.

 తెల్ల వెంట్రుకలు నల్లగా... ఇంటి చిట్కాలు.



జుట్టు తెల్లబడితే కావాల్సిన వారు ఇంటి చిట్కాతోనే దానిని నల్లబరుచుకోవొచ్చు. తెల్ల వెంట్రుకలను మటుమాయం చేసే మందు అందుబాటులోనే ఉంది. ఎలాంటి రసాయనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వనరులతోనే తెల్లవెంట్రుకలను తొలగించుకోవచ్చు. ఇందుకు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే చాలు.

బ్లాక్ టీ:

తెల్ల వెంట్రుకలకు బ్లాక్ టీ మంచి రెమెడీ. పాలు కలపకుండా కప్పు బ్లాక్ టీ తీసుకొని, అందులో టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, కలపండి. దాన్ని గోరువెచ్చగా వేడిచేసి, దాన్ని తలకు పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయండి. టీ మీ జుట్టూ మొదలువరకూ వెళ్లాలి. అలా సుమారు అరగంట సేపు టీని తలకే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోండి. రోజూ ఇలా చేస్తే తప్పకుండా తెల్ల వెంట్రుకల సమస్య తీరుతుంది.

ఉసిరి, కొబ్బరినూనె:

ఉసిరికాయలు కలిపిన కొబ్బరినూనె రోజూ రాసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్యే ఉండదు. ఎండిన ఉసిరి కాయలను కొబ్బరినూనెలో వేసి, కాసేపు వేడి చేయండి. ఆ తర్వాత రాత్రంతా దాన్ని అలాగే వదిలేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ నూనెను తలకు రాసుకోండి.

గోరింటాకు:

చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదూ! డోన్ట్ వర్రీ.. ఈ చిట్కాలు పాటిస్తే తెల్ల వెంట్రుకలు తప్పకుండా మాయమవుతాయి. గోరింటాకు పొడి లేదా హెన్నాలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపండి. వాటిని సుమారు 15 నిమిషాలు ఉడికించండి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే వదిలిపెట్టి, ఉదయం తలకు రాసుకోండి. మూడు గంటల తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోండి.

Post a Comment

0 Comments