GET MORE DETAILS

Google Gemini: గూగుల్‌ జెమిని వచ్చేసింది. ప్రత్యేకతలివే...

Google Gemini: గూగుల్‌ జెమిని వచ్చేసింది. ప్రత్యేకతలివే...



ఏఐ మోడల్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను గూగుల్ ప్రపంచానికి పరిచయం చేసింది. గూగుల్ జెమిని పేరుతో మూడు వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది.

కృత్రిమ మేధ (AI) రంగంలో గూగుల్ కొత్త అంకానికి తెరలేపింది. గూగుల్ జెమిని (Google Gemini) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్‌, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమిని 1.0 వెర్షన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా (Gemini Ultra), జెమిని ప్రో (Gemini Pro), జెమిని నానో (Gemini Pro). ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్‌ డివైజ్‌ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తెలిపారు.*

జెమిని ప్రత్యేకతలు:

శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించగలదు. విద్యార్థుల హోంవర్క్‌లో సాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్‌ హోంవర్క్‌ను ఫొటో తీసి జెమినిలో అప్‌లోడ్ చేస్తే.. దానికి కచ్చితమైన సమాధానం ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను గూగుల్ షేర్‌ చేసింది. దాంతోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను రాయడంతోపాటు యూజర్లకు సులభమైన పద్ధతిలో వివరిస్తుంది.

జెమిని ప్రస్తుతం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషల్లో పరిచయం చేస్తామని గూగుల్ తెలిపింది. గూగుల్ సెర్చ్‌ ఇంజిన్, క్రోమ్‌ బ్రౌజర్‌ సహా ఇతర గూగుల్ సర్వీసుల్లో జెమిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్‌ పిచాయ్‌ చెప్పారు.*

జెమిని నానో:

ఇది జెమిని ఏఐ మోడల్‌ లైట్‌ వెర్షన్. మొబైల్ డివైజ్‌ల కోసం దీనిని డిజైన్‌ చేసినట్లు గూగుల్ చెబుతోంది. గూగుల్ పిక్సెల్‌ 8 ఫోన్‌తోపాటు ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌లో డిసెంబరు 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. చాట్‌/మెసేజింగ్‌ యాప్‌లలో ఇతరుల మెసేజ్‌లకు యూజర్‌ రిప్లై ఇచ్చేందుకు కావాల్సిన సమాచారాన్ని ముందుగానే సూచిస్తుంది.*

జెమిని ప్రో:

ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్ బార్డ్‌ (Google Bard) ఏఐకు ఇది అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌. కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని గూగుల్ చెబుతోంది. డెవలపర్స్‌, గూగుల్‌ ప్రొడక్ట్స్ కమర్షియల్‌ యూజర్లకు డిసెంబరు 13 నుంచి జెమిని ఏపీఐ, గూగుల్ జనరేటివ్‌ ఏఐ స్టూడియో, వెర్టెక్స్‌ ఏఐ, గూగుల్‌ క్లౌడ్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది.

జెమిని అల్ట్రా:

ఏఐ లాంగ్వేజ్‌ మోడల్‌లోనే శక్తివంతమైన వెర్షన్‌ ఇదేనని గూగుల్ చెబుతోంది. డేటా సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థల వ్యాపార అవసరాల నిమిత్తం దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. పైథాన్‌, జావా, సీ++, గో వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను అర్థం చేసుకుని సులభతర విధానంలో వివరించగలదని గూగుల్‌ తెలిపింది. 2024లో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Post a Comment

0 Comments