తుఫాను ప్రభావాన్ని సూచిస్తూ హార్బర్లలో హెచ్చరికలు జారీ చేయడం గురించి అందరికీ విదితమే. ఈ హెచ్చరికల గురించిన పూర్తి వివరాలు.
✅ తుఫాన్లకు సంబంధించి మొత్తం 11 విధాలైన హెచ్చరిక చిహ్నాలుంటాయి.
🚩 1వ నెంబరు హెచ్చరిక జారీ చేస్తే.. సముద్రంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలియ జేయడం.
🚩 2వ నెంబరు జారీ చేస్తే సముద్రంలో తుఫాను ఏర్పడిందని హెచ్చరించడం.
🚩 3వ నెంబరు అకస్మాత్తుగా గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని హార్బర్‌లో హెచ్చరికలు జారీచేయడం. హార్బర్‌లో ఉండే పడవలు, నౌకలను సురక్షిత ప్రాంతంలో నిలపాలని ఇది హెచ్చరిస్తుంది.
🚩 4వ నెంబరు చిహ్నం ఎగురవేస్తే హార్బర్, సముద్ర తీర పరిసరాల్లోని గ్రామాలను హెచ్చరించడం. ఇది జాలర్లు, నౌకలు సముద్రంలోని వెళ్లకూడద ని హెచ్చరించడం.
🚩 5వ నెంబరు చిహ్నం హార్బర్‌కి కుడి వైపు తుఫాను తీరం దాటుతుందని అర్ధం.
🚩 6వ నెంబరు హార్బర్‌కి ఎడమ వైపు తుఫాను తీరం దాటుతుందని అర్ధం.
🚩 7వ నెంబరు సూచిక హార్బర్, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాద తీవ్రత అధికమని హెచ్చరించడం.
🚩 8వ హెచ్చరిక చిహ్నం హార్బర్‌కి కుడివైపు అతి తీవ్ర తుఫాను తీరం దాటవచ్చని అర్ధం.
🚩 9వ నెంబరు ఎగురవేస్తే హార్బర్‌కి ఎడమ వైపు అతి తీవ్ర తుఫాను తీరం దాటవచ్చని అర్ధం.
🚩 10వ నెంబరు చిహ్నం ఎగుర వేస్తే... హార్బర్, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాదమని హెచ్చరించడం.
🚩 11వ నెంబరు జారీచేస్తే తుఫాను ఘోర విపత్తు సృష్టించే అవకాశం ఉందని అర్ధం.
పగలు, రాత్రి వేళల్లో తుఫాను హెచ్చరికల చిహ్నాలు వేర్వేరుగా ఉంటాయి. నలుపు రంగులో ఉన్న చిహ్నాలు పగలు జారీచేసేవి. ఈ హెచ్చరికలను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా నిలువరించడం, విపత్తు నివారణ బృందాలు సహాయ చర్యలు చేపడతారు.
0 Comments