GET MORE DETAILS

ఇలా చేస్తే నిత్యం ఉత్సాహమే...!

 ఇలా చేస్తే నిత్యం ఉత్సాహమే...!



శరీరం అనారోగ్యానికి గురైన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, ముందుగానే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చిన్నచిన్న అంశాల్లో పాటించే పద్ధతులే నిత్యం ఉత్సాహంగా మారుస్తాయి.

• ఇంట్లో అందరికంటే ముందుగా నిద్రలేవండి. నులివెచ్చని సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ బాల్కనీ లేదా పెరట్లో కాసేపు గడపండి దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్-డి సమకూరుతుంది. ఇది మన లోని నిరుత్సాహాన్ని దూరం చేస్తుంది.

• నిద్రలేచిన వెంటనే హడావుడిగా పనులు మొదలు పెట్టకుండా ధాన్యంతో రోజును ప్రారంభించండి. నిద్రపోయే ముందూ ఇదే చేయండి. తలదిండుపై రెండు చుక్కల లావెండర్.. లేదా జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను వేస్తే చాలు ఇది మనసును ఆహ్లాదంగా మారుస్తుంది. కంటి నిండా నిద్రపడుతుంది. ఒత్తిడి మాయమవు. తుంది.

• వారానికి ఒకసారి శరీరంలోని మలినాలను బయటికి పంపే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం రాత్రిపూట నీటిలో తాజాపండ్లు, పచ్చిఅల్లం ముక్క లను వేసి నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం తీసుకో వాలి. వీలైతే, ఎక్కువ నీటిని ఇలా పానీయంలా తయారుచేసుకుని, మరుసటి రోజంతా తాగితే మంచిది. ఇది వ్యర్థాలను బయటకు పంపు తుంది.

• ఇంటి నుంచి లేదా కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు గంటకోసారి స్వల్ప విరామం తీసుకుని చిన్నచిన్న వ్యాయా మాలు చేయాలి.

• వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. ఇది మసా జ్లో పనిచేసి నాడులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తి డిని దూరం చేస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు మనకోసం మనం కొంత సమయాన్ని కేటాయించు కుని ఆది మనసుకు నచ్చిన స్నేహితులతో మాట్లా డటం, ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం వంటివి మెదడుకు వ్యాయామంలా పని చేస్తాయి. ఇవి వారానికి సరిపడా ప్రశాంతతను అందిస్తాయి.

• రోజులో మధ్యాహ్నం పూట పావుగంట సేపు వేసే చిన్న కునుకు శరీరాన్ని ఉత్తేజంగా మారు స్తుంది. మనసులోకి ఆందోళనను దగ్గరకు రాని వ్వదు. రాత్రిపూట నిద్రపోయే ముందు అలసటగా అనిపిస్తే, గోరువెచ్చని నీటిని నింపిన చిన్న టబ్లో పాడాలు మునిగేలా అరగంట సేపు ఉంచాలి. దీంతో కాళ్లు, పాదాల కండరాలు ఉపశమనం పొందుతాయి. లేదంటే అలసట మరుసటి రోజు కూడా మనల్ని వెంటాడుతుంది.

Post a Comment

0 Comments