GET MORE DETAILS

ఉప్పు తగ్గిద్దాం...!

 ఉప్పు తగ్గిద్దాం...!ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోజుకి 5 గ్రాల ఉప్పుకి మించి తీసుకోవటం ఆరోగ్యరీత్యా ప్రమాదకరం. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దీనికి రెట్టింపుగా రోజుకి 10 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నామని తేలింది. ఇలా ఉప్పు మీద నియంత్రణ లేక పోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కో వలసివస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)

అమెరికాలోని సిడిసి ఉప్పు వాడకం గురించి కొన్ని కళ్లు తిరిగే వాస్తవాలను వెలు గులోకి తీసుకొచ్చింది. అవేంటంటే... మనం తినే ప్రధానమైన 10 ఆహార పదార్ధాల్లో ఉప్పుని 25 శాతం తగ్గించగలిగితే రోజువారీ ఉప్పు పరిమాణంలో 11 శాతం (360మి.గ్రా) తగ్గించినట్టవుతుందని సిడిసి తెలిపింది. అంటే రోజుకి సుమారు 400మి.గ్రా ఉప్పులో కోత పెట్టినట్టే! ఇలా చేయటం వల్ల ఒక ఏడాదిలో ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చులో 7 బిలియన్లు మిగల్చటంతోపాటు ఏటా 28,000 ప్రాణాలనూ కాపాడుకోవచ్చు.

భారతీయ వంటకాల్లో భిన్నమైన దినుసుల్ని వాడతాం. పులుపులు, కారాలు ఎక్కువే! మనం వండే కూరలు, పులుసుల్లో టమాటాలు, చింత పండు, ఉల్లిపాయలే బేస్ ఇంగ్రిడియెంట్స్, వీటితో వంటకి వచ్చే రుచిని బ్యాలెన్స్ చేయటం కోసం సరి పడా ఉప్పుని వాడక తప్పదు. దాంతో అవసరానికి మించి ఉప్పు వంటకాల్లో చేరిపోతూ ఉంటుంది.

డబ్ల్యుహెచ్ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)

డబ్ల్యు హెచ్ ఒ కూడా ఉప్పు వాడకం గురించి కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. రోజుకి 2,000 మి.గ్రా సోడియం... అంటే 5గ్రా ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఈ కొలత పెరి గితే రక్తపోటు, దాంతోపాటు హృద్రోగాలు, గుండెపోట్లు తప్పవు.

ఇవిగాక ఉప్పుతో కూడిన చిప్స్, స్నాక్స్, జంక్ ఫుడ్ ఉండనే ఉన్నాయి. ఈ సాల్ట్ ఇన్టేక్లో మార్పు రావాలంటే వంట వండే పద్దతుల్లో మార్పు రావాలి. ఇందుకోసం ఈ చిట్కాలు పాటించాలి.

దేన్లో ఎంత ఉప్పు?

100గ్రా పాలు, పెరుగు-50మి.గ్రా

100గ్రా గుడ్లు -80మి.గ్రా

100గ్రా బ్రెడ్ - 250మి.గ్రా

100గ్రా సోయా సాస్ 1500మి.గ్రా

100గ్రా సాల్ట్ చిప్స్, బిస్కెట్స్- 1500మి.గ్రా

వంట చేసేటప్పుడు ఉప్పుని వంటకం చివర్లో కలపాలి. వంట మధ్యలో రుచి చూసే అలవాటు వల్ల అవసరానికి మించి ఉప్పు కలిపే అవకాశం ఉంటుంది. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే. పదార్థాల్లో సహజంగా ఉండే ఉప్పుతో వంటకాన్ని ఉడకనిచ్చి అవసరమైతేనే అదనంగా ఉప్పు జోడిం చాలి.

• ఉడికించే బదులు, ఆవిరి మీద ఉడకబెట్టటం, గ్రిల్లింగ్, మైక్రోవేవ్లో వండటం అలవాటు చేసుకోవాలి.

• కూరగాయల్ని ఉడకబెట్టేటప్పుడు మిగిలిన నీళ్లను పారబోసి కొంత ఉప్పుని తొలగించుకో వచ్చు.

• ఉప్పుకు బదులుగా తులసి, పుదీనాలాంటి హెర్బ్స్ వాడకాన్ని పెంచి వంటకాల్లో ఉప్పు స్థానాన్ని కొంతవరకూ భర్తీ చేయొచ్చు.

• తక్కువ సోడియం ఉండే లైట్ సాల్ట్స్ వాడాలి.

ఉప్పు తగ్గినా ఆ రుచికి శరీరం అలవాటు పడుతుంది. నాలుక అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి వంటకం చివర్లో ఉప్పు కలపటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పదార్థం నోట్లో నలిగేటప్పుడు నాలుకకు ఉప్పు రుచి తగిలి భోజనం ముగించే వరకూ ఆ రుచి మిగిలే ఉంటుంది.

• పిల్లలకు చిన్నప్పటినుంచే ఉప్పు తక్కువ అల వాటు చేయాలి. సాల్టీ ఫుడ్స్ వల్ల కలిగే నష్టాన్ని తెలియజెప్పాలి.

Post a Comment

0 Comments