రోగనిరోధకశక్తిని పెంచే తోటకూర
ఆకుకూరల్లో ఉండే పోషకాలు మనకి తెలియనివి కాదు. మార్కెట్లో ఆ ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. తరచూ తోటకూరను తింటే మంచిదని చెబుతుంటారు పెద్దవాళ్లు. ఎందుకో చూద్దాం...
• తోటకూరలోని 'విటమిన్ సి' రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.
• తక్షణ శక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
• అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది. హైపర్టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
• బరువు తగ్గాలనుకునేవాళ్లు క్రమంతప్పకుండా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది.
• తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది.
• కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ వీటిలో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
• విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు ఇవన్నీ సమకూరుతాయి.
• వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.
0 Comments