పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇవి తినిపించండి
సోయా ప్రొడక్ట్స్: సాధారణంగా ఎత్తు పెరగడానికి కాల్షియం అవసరం అవుతుంది. ఇవి సోయా ప్రొడక్ట్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఎత్తు పెరగాలనుకునేవారు సోయా ప్రొడక్ట్స్ అంటే సోయా బీన్స్, మిల్ని రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోండి.
పాలు: కాల్షియంకి కేరాఫ్ అడ్రస్ పాలు.. మిల్స్లో కాల్షియంతో పాటు విటమిన్ డి, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా పాలు తాగడం వల్ల పొడవు పెరుగుతారు.
మాంసం: దీనిని తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు. ఇందులో ఎత్తు పెరగడానికి అవసరమయ్యే అన్నీ ప్రోటీన్స్ ఉంటాయి. చికెన్, మటన్ లోని ప్రోటీన్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
గుడ్డు: ఇది కూడా ఎత్తుని పెంచడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో అనేక విటమిన్స్ కాల్షియం ఉంటాయి. కాబట్టి గుడ్డు తినడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సాయపడుతుంది.
బెండకాయ: వీటిల్లో విటమిన్స్, ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎత్తు పెరుగుతారు. ప్రోటీన్స్, కాల్షియంతో పాటు విటమిన్ ఎ, బి, డి, ఇలు ఉంటాయి.
ఆకుకూరలు: వీటిల్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా బచ్చలి కూర. ఆసియాలోనే అధికంగా లభించే ఈ ఆకుకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీని వల్ల హైట్ పెరుగుతారు.
0 Comments