GET MORE DETAILS

పోషకాల సెనగలు

 పోషకాల సెనగలు



తాంబూలంలో భాగంగా అరటిపండూ, తమలపాకులే కాదు నానబెట్టిన సెనగల్నీ ఇవ్వడం.. వరలక్ష్మీవ్రతం సంప్రదాయం. అలా వాయనంగా తీసుకున్న సెనగల్ని ఏంచేయాలనుకుంటున్నారు.. ? ఉడికించుకుని వేయించుకోవడం ఒక్కటే కాదు, మరికొన్నిరకాల్లోనూ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

సెనగల్ని ఒకటి రెండు రోజులు అలాగే వదిలేస్తే మొలకలు వస్తాయి. అప్పుడు ఉడికించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటికి టొమాటో ముక్కలూ, సన్నగా తరిగిన కీరా, పచ్చిమిర్చీ పుదీనా... తగి నంత ఉప్పూ, చాట్ మసాలా వేసి నిమ్మ కాయ పిండితే నోరూరించే సలాడ్ సిద్ధం అవుతుంది. పిల్లలకోసం టిక్కీలుగా ప్రయత్నించవచ్చు. అలాగే క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ లాంటి కూరల్లో బఠాణీలకు బదులు వీటిని వేసుకున్నా రుచిగానే ఉంటుంది. ఇవేవీ కాదనుకుంటే ఏకంగా వాటితోనే కూర చేసుకోవచ్చు. ఎలా తిన్నా వీటి నుంచి పోషకాలు అందుతాయి.

• సెనగల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్ స్థాయులు తక్కువ. కాబట్టి వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపి స్తుంది. జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగువుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరస్థాయులు కూడా అదుపులో ఉంటాయి.

• వీటిలో ఫొలేట్, మెగ్నీషియం స్థాయులూ ఎక్కువే. ఫొలేట్ హోమోసి స్టీన్ అనే అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానివల్ల గుండెలోని రక్తనా ళాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గు తుంది. ఫొలేట్ వల్ల కొత్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

• మహిళలకు మేలుచేసే పదార్థాల్లో సెనగలు కూడా ఒకటి. వీటిల్లో ఉండే ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రొమ్ముక్యాన్సర్ ప్రభావాన్నీ, మెనోపాజ్ తరవాత వచ్చే సమస్యల్నీ కొంతవరకూ అదుపులో ఉంచుతాయి.

• రోజులో శరీరానికి అవసరమైన ఇను ములో చాలాశాతం సెనగల నుంచి పొందవచ్చు దాంతో రక్తహీనత, అల సట, నిద్రలేమి, జుట్టురాలడం, తలనొప్పి వంటివాటి బారిన పడకుండా ఉంటాం.

Post a Comment

0 Comments