మచ్చలు పోవాలంటే...
ముఖం తాజాగా కనపడాలని మొహంపై ఎక్కువగా క్రీమ్స్ రాయడం వలన మొదట్లో బాగున్నా, పోను పోను మొహంపై అక్కడక్కడ నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలను గిచ్చేసి, గోకేసి మొహాన్ని మరింత ఘోరంగా చేసుకోకుండా, వంటింట్లోనే ఉండే వస్తువులతో మచ్చలను తొలగించేసి, మొహాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
• అలోవేరా (కలబంద)ను వాడటం వలన మీ చర్మంపై ఉండే మొటిమలు మచ్చలు పోయి, మొఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
• వెల్లుల్లిలో ఎక్కువ ఘాటుదనంతో పాటు, సల్ఫర్ కూడా ఉండడం వలన చర్మంపై ఉండే నల్లని మచ్చలకు విరుగుడుగా పని చేసి, ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది.
• ఏ కాలంలో అయిన వాడె ఏకైక వస్తువు తేనే. ఈ తేనే వలన చర్మం, జుట్టు వంటి వాటికే కాక.. మొఖాన్ని కూడా కాంతివంతంగా తయారుచేస్తుంది.
• నిమ్మరసం జిడ్డును కొరికేస్తుంది. దీనివల్ల మొహం పైన ఉండే జిడ్డు, నల్లని మచ్చలను తొలగించేసి మంచి రంగును అందిస్తుంది.
• ఆలుగడ్డను బాగా దంచితే వచ్చే రసాన్ని నల్లటి మచ్చలపై పూసి మర్దనా చేయడం వలన నల్లటి మచ్చలు కనిపించకుండపోతాయి.
• ఉల్లిగడ్డను బాగా దంచి, ఆ పేస్ట్ను నల్ల మచ్చలపై రాస్తే.. మచ్చలు పోయి, మొహం మెరిసిపోతుంది.
0 Comments