GET MORE DETAILS

08-03-2024 - శుక్రవారం - రాశి ఫలితాలు

08-03-2024 - శుక్రవారం - రాశి ఫలితాలు

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున  స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

వృషభం:

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో  ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.

---------------------------------------

మిధునం:

ఉద్యోగమున  పని ఒత్తిడి ఉన్నప్పటికీ  పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం:

గృహమున సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

సింహం:

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు. ఉద్యోగమున  అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు  కలుగుతాయి.

---------------------------------------

కన్య:

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో  కొన్ని  పనులు  పూర్తి అవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  స్ధిరాస్తి   క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల:

చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో  కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.  ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం  దాలుస్తాయి.

---------------------------------------

వృశ్చికం:

అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగమున  దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు  కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు:

ఆకస్మిక  ప్రయాణాల వలన  శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల  ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

మకరం:

వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన  వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

---------------------------------------

కుంభం:

బంధు మిత్రులతో మాటపట్టింపులు  పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి  ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.   దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

--------------------------------------

మీనం:

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారమున నూతన  ఆలోచనలు  అమలు చేస్తారు.  ఆర్థిక  పురోగతి కలుగుతుంది. పాత  మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  చేపట్టిన  వ్యవహారాలు సజావుగా  సాగుతాయి.

Post a Comment

0 Comments