GET MORE DETAILS

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌

 ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌


ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో కొత్త నిర్ణయం అమల్లోకి రానుంది. రైల్వే స్టేషన్లలోని సాధారణ టికెట్ కౌంటర్లలోనూ ఇక డిజిటల్ పేమెంట్స్‌ను అనుమతించనున్నారు.

రైల్వే ప్రయాణికులు క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డ్, QR కోడ్ స్కానర్‌, UPI ద్వారా కూడా టికెట్ కోసం చెల్లింపులు చేయొచ్చు. డిజిటల్‌ పేమెంట్ల విధానాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ కొత్త నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో రైల్వే టికెట్(April 1st – Railway Tickets) కౌంటర్ల వద్ద చిల్లర సమస్యకు చెక్‌పెట్టినట్లు అవుతుంది.

మన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే రైలు ప్రయాణకుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించి సాధారణ రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది

Post a Comment

0 Comments