Ads Area

25న తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి

0

 25న తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి



తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవం ఈనెల 25వ తేదీన జరగనుంది. పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరుల్లో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీ ర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబుర, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు. ఈతీర్థాల్లో ఆయా పుణ్య ఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమ కూరుతుందని పురాణ వైశిష్ట్యం. ఇందులో భాగంగా ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజున తుంబుర తీర్థ ముక్కోటిని నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి సౌందర్యాల నడుమ తుంబుర తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అను భూతిగా భక్తులు భావిస్తారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area