GET MORE DETAILS

షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే...!

 షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే...!



రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం మధుమేహులకు చాలా అవసరం. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పననిసరి.


• రోజూ క్రమంతప్పకుండా వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అన్నింటికన్నా మంచి వ్యాయామం ఇది. ముఖ్యంగా మధుమేహులు వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలి.


• యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా చూడటంలో యోగా సహాయపడుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి దూరమవుతుంది.


• శరీరంలోని అన్ని అవయవాలపైన ఒత్తిడి పడాలంటే ఈత కొట్టడం ఒక్కటే మార్గం. కొవ్వు కరగడానికి, మంచి వ్యాయామం చేసిన ఫలితాలు పొందడానికి ఈత ఉపయోగపడుతుంది.


• ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని కాసేపు డ్యాన్స్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డ్యాన్స్ వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


• వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సైకిల్ తొక్కొచ్చు. సైకిల్ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. రక్తసరఫరా మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

Post a Comment

0 Comments