GET MORE DETAILS

చర్మం యౌవనంగా ఉండాలంటే...!

 చర్మం యౌవనంగా ఉండాలంటే...!



కాలం గడుస్తున్న కొద్దీ ప్రతివారి చర్మంలోనూ మార్పులు వస్తుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులతో అది యౌవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. దానిలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలను పాటించండి.

◾ మనం స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత విషయంలో ఓ మాట గుర్తుంచుకోండి. మన శరీర ఉష్ణోగ్రత కంటే ఆ నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. మరింత ఎక్కువ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది.

◾ మీరు వాడే సబ్బు మరింత సుంగధభరితమై నది కాకుండా చూసుకోండి. మైల్డ్ సోప్లు వాడ టమే మంచిది.

◾ మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్ చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి.

◾ పొగతాగే అలవాటును వెంటనే మానేయాలి. పొగలోని రసాయనాలు ఏజింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి.

◾ రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్క్రీ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. వారికి తగిన ఎస్పీ ఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్)తో ఉండే సన్ స్క్రీన్ కోసం ఓసారి డాక్టర్ను సంప్రదిస్తే మరింత మేలు.

◾ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంత మైన దుస్తులు వేసుకోండి.

◾ పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసు కోండి. అందులో యాంటీఆక్సిడెంట్స్, విట మిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువ.

◾ ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పో కుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్ గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది.

◾ మన చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్సు వెంటనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అవి మరింత అవి ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

◾ డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం చాలా రోజులు, ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది.

Post a Comment

0 Comments