GET MORE DETAILS

మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం

 మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం



మధుమేహాన్ని నియంత్రించేందుకు యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని గుర్తించారు. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీ రంలో టీఈటీ3, హెచ్ఎన్ఎఫ్ఎ4ఏ అనే రెండు ప్రొటీన్లు కాలేయంలో పేరుకుపోతాయని, ఫలితంగా గ్లూకోజ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుం దని యేల్ వైద్యశాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తిం చారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో శరీరంలోకి ఆహారం ప్రవేశించిన వెంటనే ఈ రెండు ప్రొటీన్లు పేరుకుపోవడం ఆగిపోతుందని, టైప్-2 మధుమేహం ఉన్నవారిలోమాత్రం అలాగే కొనసాగుతూంటుందని ఈ పరిశోధ నల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షూచెన్ ఝాంగ్ తెలిపారు. ప్రొటీన్లు పేరుకుపోయే ప్రక్రియను ఆపేందుకు మరో పద్ధతి ఉండవచ్చునన్న అంచనాతో పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు అందులో విజయం సాధించారుకూడా. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు వైరస్లలోకి స్మాల్ ఇంటర్ఫెరింగ్ ఆర్ఎన్ఏలు జొప్పించి ఆ రెండు ప్రొటీన్లపైకి ప్రయోగించారు. ఇది కాస్తా ప్రొటీన్ల మోతాదును తగ్గించినట్లు గుర్తించారు. అదేసమయంలో రక్తంలో గ్లూకోజ్ మోతాదు కూడా తగ్గింది. అంతేకాదు.. టీఈటీ3 ప్రొటీన్ లివర్ సైరోసిస్కు దారితీసే ఫైబ్రోసిస్ లక్షణాలకూ కారణమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మధుమేహా చికిత్సకు వాడే మందులతోనే లివర్ ఫైబ్రోసిస్కూ చికిత్స కల్పించవచ్చునన్నమాట. ప్రస్తుతం లివర్ ఫైబ్రోసిస్కు ఎలాంటి చికిత్స లేకపోవడం గమనార్హం. మధుమేహ నియంత్రణకు సంబంధించిన వివరాలు నేచర్ కమ్యూనికేషన్ తాజా సంచికలో ప్రచురితం కాగా.. ఫైబ్రోసిస్ అధ్యయనం సెల్ రిపోర్ట్లో కనిపించింది.

Post a Comment

0 Comments