GET MORE DETAILS

నేరేడు : పండంతా పరమౌషధమే...!

 నేరేడు : పండంతా పరమౌషధమే...!



డయాబెటిస్ ను (మధుమేహం) స్వాభావికమైన తేలిక మార్గంలో, అంటే కేవలం పండ్లు తినడం ద్వారానే అదుపు చేయగల సామర్థ్యం నేరేడు సొంతం. అదొక్కటే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజ నాలను ఇస్తుందీ పండు. 

నేరేడు పండ్లలో క్యాల్షి యమ్, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్పరస్, విటమిన్ -సి; విటమిన్-బి కాంప్లెక్స్లోని రైబోఫ్లేవిన్, నియా సిన్, విటమిన్-బి6 వంటి వాటితోపాటు కెరటిన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇక వంద గ్రాముల నేరేడు పండ్లలో 0.6 గ్రాముల పీచు ఉంటుంది. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలు న్నాయి. వాటిలో కొన్ని.

• నేరేడు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడమే కాదు, డయాబెటిస్ లక్షణాలైన అతిమూత్రం, బాగా దాహంగా అనిపించడం వంటి లక్షణాలను సమర్థంగా తగ్గిస్తుంది.

• నేరేడు పండ్లు అనేక రకాల నోటి సమస్యలనూ తగ్గిస్తాయి. దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడ తాయి. నోటిలో వచ్చే కురుపులు, పుండ్లను నయం చేస్తాయి.

• నేరేడులో పొటాషి యమ్ పాళ్లు ఎక్కువ. వందగ్రాముల నేరే డులో 55 మి.గ్రా. పొటాషి యమ్ ఉండటం వల్ల ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండెజబ్బులనూ, గుండె పోటును కూడా నివారిస్తుంది.

• ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్త హీనతను సమర్థంగా నివారిస్తాయి. అనీమియాకు రుచికరమైన ఔషధం నేరేడు.

• నేరేడులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్య వస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. పేగుల్లో వచ్చే అల్సర్లను తగ్గిస్తాయి. డయేరియా సమ స్యను దూరం చేస్తాయి. మొలలను స్వాభావిక మార్గంలో తగ్గించే గుణం నేరేడులో ఉంది.

• నేరేడులోని పాలీఫీనాల్ వంటి ఫైటోకెమికల్స్ క్యాన్సర్లతో పోరాడతాయి. అందుకే నేరేడుతో ఎన్నో రకాల క్యాన్సర్లు నివారితమవుతాయి.

• ఈ పండ్లు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితి త్తుల సమస్యలను దూరం చేస్తాయి.

• నేరేడు వికారం, వాంతులు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

• నేరేడులోని శక్తిమంతమైన పోషకాలు, ఫైటోకెమి కల్స్ కారణంగా అది రోగనిరోధక శక్తిని పెంపొం దించి, ఎన్నో వ్యాధులను నివారిస్తుంది.

• ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే అనర్ధాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది.

• మహిళల్లోని సంతానలేమి సమస్యను స్వాభావి కంగా దూరం చేస్తుంది.

• అనేక రకాల చర్మవ్యాధులను నిరోధిస్తుంది. ఒంటిపైన వచ్చే గడ్డలు, చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది.

• ఇందులో క్యాల్షియమ్ కూడా ఎక్కువే. కాబట్టి ఎముకలకు బలాన్ని చేకూరు

స్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలైన రుమాటిక్ నొప్పులు, గౌట్ సమస్య వల్ల కలిగే బాధలు నేరేడు తినడం వల్ల దూరమవుతాయి.

• స్క్రీన్ ఎన్లార్జ్మెంట్ను కూడా నేరేడు నివారిస్తుంది.

Post a Comment

0 Comments