GET MORE DETAILS

వృచ్చిక రాశి 2024: వృశ్చిక రాశి వారి ఆర్థిక విషయాలు 2024-25

వృచ్చిక రాశి 2024: వృశ్చిక రాశి వారి ఆర్థిక విషయాలు 2024-25



వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా పురోగతి లభించును. అప్పుల బాధలు తగ్గును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి కలుగును. 

2024 జ్యోతిష్యం ప్రకారం, వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు. రాహువు కేతువులు వరుసగా ఐదు, పదకొండో స్థానాలలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలలు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో రాకేష్ పండితులు గారు తెలిపిన వివరాల మేరకు కొత్త సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏయే శుభ, అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశి నుంచి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఆరో స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ కారణంగా మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది. మీ శత్రువులను ఓడిస్తారు. మీ వేతనం పెరగొచ్చు. విదేశీ పర్యటనల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది.ఈ రాశి నుంచి శని దేవుడు నాలుగో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో పంచ మహా పురుష రాజయోగం ఏర్పడనుంది. దీంతో వృశ్చికరాశి వారు అఖండ విజయాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలొస్తాయి. ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శని దేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందుతారు.

ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ 14న ఉన్నతమైన రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలయిక జరపనున్నాడు. ఈ సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయం సాధించగలరు. ప్రభుత్వానికి సంబంధించి పని చేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యుని ఆశీస్సుల వల్ల మీరు మంచి గౌరవం పొందుతారు.ఈ రాశి నుంచి మార్చి 15న శని, కుజుడు నాలుగో స్థానం నుంచి కలయిక జరపనున్నారు. కుజుడు ఏప్రిల్ 23వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం ఉండొచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ రాశి నుంచి కేతువు పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. కేతువు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీకు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి. కేతువు సంచారం వల్ల ఏడాది పొడవునా మీ జీవితంలో లాభాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండొచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండొచ్చు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారం, కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సమన్వయ సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు. విద్యా రంగంలో మీరు మంచి విజయం సాధిస్తారు. మీరు సైన్స్, టెక్నికల్ రంగాలలో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి.

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి నుంచి శని నాలుగో స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు ఐదో స్థానంలో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు. మీరు యోగా, ధ్యానం, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ రాశి నుంచి రాహువు ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ మయంలో ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శని, రాహువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలొస్తాయి. 

విద్యార్థులకు విద్యలో ఆటంకాలు ఏర్పడొచ్చు. ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉండదు. మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి మార్చి 31వ నుంచి శుక్రుడు మీనరాశిలో రాహువుతో కలయిక జరపనున్నాడు. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఐదో స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ సమయంలో శుక్రుడు, రాహువు కలయిక వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు అజీర్థం సంబంధిత సమస్యల్లో పెరుగుదల చూస్తారు.ఈ రాశి వారు కొత్త ఏడాదిలో రాహు మంత్రాలు, శని మంత్రాలను పఠించాలి. సోమవారం రోజున ముల్లంగిని దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే ఏడు ముఖాల రుద్రాక్షలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

Post a Comment

0 Comments