GET MORE DETAILS

16-05-2024 - గురువారం - రాశి ఫలితాలు

16-05-2024 - గురువారం - రాశి ఫలితాలు 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి  వ్యాపారాలు  లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు.  ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.  ఆర్థిక విషయాలు  సంతృప్తికరంగా సాగుతాయి.  సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం:

ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో  పూర్తవుతాయి. స్థిరస్థి వృద్ధి చెందుతుంది.  వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది పొందుతారు.

---------------------------------------

మిధునం:

బంధువులతో కొన్ని విషయాల్లో  మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా  సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా  కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

కర్కాటకం:

దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి  ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

సింహం:

పాత  మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు  పూర్తి చేస్తారు. కుటుంబ  సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో  స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

కన్య:

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో  పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

---------------------------------------

తుల:

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.  కొన్ని వ్యవహారాలలో  ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి.  స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృశ్చికం:

దైవ సేవా కార్యక్రమాలపై  దృష్టి సారిస్తారు.  వృత్తి వ్యాపారాలలో  ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట  పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

---------------------------------------

ధనస్సు:

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున  శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

---------------------------------------

మకరం:

సోదరులతో  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. చాలకాలంగా పూర్తి కానీ  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ  కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం:

నూతన వ్యాపార ప్రారంభానికి  అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో  కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు  కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.

---------------------------------------

మీనం:

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

Post a Comment

0 Comments