GET MORE DETAILS

ముఖేశ్‌ అంబానీ అదాయం గంటకు రూ.90 కోట్లు

ముఖేశ్‌ అంబానీ అదాయం గంటకు రూ.90 కోట్లు


May 15,2024 00:20

 ఐఐఎఫ్ఎల్‌ హురూన్‌ వెల్లడి


శ్రమజీవుల కష్టార్జీతంతో అనునిత్యం శ్రమ దోపిడితో దేశంలోని శత కోటీశ్వర్లు కోట్లకోట్లకు పడగలెత్తుతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండదండలతో ఆక్టోపస్‌లో అన్ని రంగాల్లోకి చొరబడి దేశ వాణిజ్య రంగంలో గుత్తాధిపత్యం చలాయిస్తున్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీ వంటి వాళ్ల ఆదాయం ఆకాశమే హద్దుగా పెరిగిపోతంది. ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలోనే 11వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా రికార్డులకెక్కిన ముకేశ్‌ అంబానీ కొనసాగుతున్న సంపద ఏకంగా 106 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.9,15,405 కోట్లు. ఆయన గంటకు రూ.90 కోట్లు ఆర్జిస్తున్నారు. విస్తుపోయే ఈ అంశాలను ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఆక్స్‌ఫామ్‌ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. 2020లో కోవిడ్‌ మహమ్మారి దేశమంతటా విస్తరించి అల్లకల్లోలం సృష్టించిన సమయంలోనూ భారత కార్పొరేట్‌ దిగ్గజాలకు ఆదాయాలు రెట్టించాయే కానీ ఇసుమంతైనా తగ్గింది లేదు. కోవిడ్‌ క్లిష్టపరిస్థితుల్లోనూ ముకేశ్‌ అంబానీ గంటకు రూ.90 కోట్లు చొప్పున సంపాదించినట్లు ఐఐఎఫ్ఎల్‌ పేర్కొంది. దేశంలో దాదాపు 24 శాతం మంది ప్రజలు నెలకు కేవలం రూ.3000 లోపు మాత్రమే సంపాదిస్తున్నారు.

ముకేశ్‌ అంబానీలా సగటు భారతీయుడు సంపాదించాలంటే కలలో కూడా సాధ్యం కాదేమో. ఎందుకంటే స్టాటిస్టికా అంచనాల ప్రకారం..నెలకు రూ.33 వేలు (ఒక సంవత్సరానికి రూ.4 లక్షలు) ఆర్జించే సగటు వేతనజీవి అంబానీ ఒక గంటలో సంపాదించే రూ.90 కోట్ల మొత్తాన్ని సంపాదించాలంటే ఏకంగా 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. వాస్తవానికి రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు మాత్రమే. ఆయన ఒక రోజులో ఒక గంటలో సందించే ఆర్జనతో పోల్చితే ఇదే ఏమూలకూ సరిపోదు. ముకేశ్‌కు పెట్రో కెమికల్స్‌, రిఫైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్స్‌ప్టోరేషన్‌, టెక్స్‌టైల్స్‌, రిటైల్‌, టెలికమ్యూనికేషన్స్‌ లాంటి భారీ వ్యాపార సామాజ్య్రాలే ఉన్నాయి. వీటన్నంటిలో పనిచేస్తున్న లక్షలాది మంది కష్టజీవులు శ్రమను దోపిడి చేసినందునే అంబానీ గంటగంటకూ కోట్లకు కోట్లు పోగేసుకుంటున్నారని, ఇలాంటి సంపద కేంద్రీకరణతో దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఏర్పడి పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రమవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రకృతి సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా కార్పొరేట్‌ వ్యక్తులకు దోచిపెట్టే విధానాలు మారాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments