GET MORE DETAILS

తలసేమియాని తరిమేద్దాం: మే 8 తలసేమియా నివారణ దినోత్సవం

తలసేమియాని తరిమేద్దాం: మే 8 తలసేమియా నివారణ దినోత్సవం


యం. రాం ప్రదీప్

తిరువూరు

9492712836



మానవుడు ఎన్నో అంతుబట్టని వ్యాధులని ఎదుర్కొంటున్నాడు. వీటిలో కొన్నింటికి మందులు ఉన్నాయి. మరి కొన్నింటికి మందులు కనిపెట్టడానికి పరిశోధనలు జరుగుతున్నాయి

ఇటువంటి అరుదైన వ్యాధులలో తలసేమియా ఒకటి.త‌ల‌సేమియా అనేది వంశ‌పార‌ప‌ర్యంగా త‌ల్లి లేదా తండ్రి నుండి పిల్ల‌ల‌కు సంక్ర‌మించే జ‌న్యు ర‌క్త రుగ్మ‌త‌. ఇది మైన‌ర్‌, ఇంట‌ర్నీడియ‌ట్ మ‌రియు మేజ‌ర్ అనే మూడు ద‌శ‌లుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి గురైన‌వారిలో శ‌రీరంలో ఉండాల్సిన హిమోగ్లోబిన్ స్థాయి క‌న్నా త‌క్కువ‌స్థాయి హిమోగ్లోబిన్ ఉంటుంది. దీంతో ఎముక‌ల యొక్క సాంద్ర‌త త‌గ్గి రోగి బ‌ల‌హీనంగా త‌యార‌వుతారు. త‌ల‌సేమియా ఆల్ఫా మ‌రియు బేటా అనే రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక్కో రకానికి వేర్వేరు జ‌న్యువులు ఈ వ్యాధి వ‌ల‌న ప్ర‌భావిత‌మ‌వుతాయి.

తలసేమియా వ్యాధి యొక్క లక్ష‌ణాలు, చికిత్సా విధానం గురించి ప్ర‌జ‌ల‌లో పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. అందుకే ఈ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం మే 8వ తేదీని ప్ర‌పంచ త‌ల‌సేమియా దినోత్సంగా గుర్తించారు.

ఈ వ్యాధి మ‌న దేశంతోపాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు, ద‌క్షిణాసియా, ద‌క్షిణ చైనా ప్రాంతాలలో ఎక్కువ‌గా ఉంది. సీబీసీ (కంప్లీట్ బ్ల‌డ్ కౌంట్‌) టెస్ట్‌, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరెసిస్‌, ఎఫ్‌పీ (ఫ్రీ-ఎరిత్రోసైట్ ప్రోటోపోరోపైరిన్‌) మ‌రియు ఫెర్రిటిన్ వంటి టెస్టులతో ఈ వ్యాధిని నిర్ధారించ‌వ‌చ్చు. ఒక్క బ్ల‌డ్ శాంపిల్‌తో ఈ టెస్టుల‌న్నీ చేయించుకోవ‌చ్చు. గర్భిణీల్లో సివిఎస్ లేదా యామ్నిసెంటెసిస్ టెస్ట్‌తో పుట్ట‌బోయే పిల్ల‌ల‌లో ఈ వ్యాధిని నిర్ధారించ‌వ‌చ్చు. ఆల్ఫా త‌ల‌సేమియాను డిఎన్ఏ టెస్ట్‌తో నిర్ధారించ‌వ‌చ్చు.మేనరికపు వివాహల వల్ల, జన్యు పరమైన లోపాల వల్ల, పౌష్టికాహార లోపం వల్ల ఈ వ్యాధి రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తలసేమియా బాలసేవా పథకం పేద రోగులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.నిర్దేశిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ పథకాన్ని పొందవచ్చు. స్కీమ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం వినియోగదారులు మెడికల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.

ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా తలసేమియా సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాయధాన్యాలు, గుడ్డు పచ్చసొన, ఎండిన బీన్స్, చిలగడదుంప, హోల్‌గ్రెయిన్ బ్రెడ్, సోయా ఉత్పత్తులు, స్ప్లిట్ బఠానీలు, గింజలు, బ్రస్సెల్ మొలకలు, అరటిపండ్లు మరియు పీచెస్ వంటి కొన్ని ఆహారాలు,ప్రతిరోజూ రెండు గ్లాసుల పాలు తలసేమియా సమస్యను నయం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments