GET MORE DETAILS

మీ ఆరోగ్యం మీ చేతుల్లో : శరీరం - ప్రత్యేక అవసరాలు

  మీ ఆరోగ్యం మీ చేతుల్లో : శరీరం - ప్రత్యేక అవసరాలు



పోషక సంబంధమైన అవసరాలు ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి, జీవన విధానాల (Life Styles) బట్టి ఎవరికి వాళ్ళకు వేరు వేరు విధాలుగాఉంటాయి.

దిగువ ఇచ్చిన చార్టులో మనిషి జీవన విధానాన్ని బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి ఎవరికి ఏ పోషకాహారపు అవసరం ఎక్కువ ఉంటుందో తెలుసుకోవచ్చు.

పొగతాగే అలవాటుంటే... విటమిన్ 'సి' అవసరం ఎక్కువ.

• పొగ తాగటం వల్ల మిగతా నష్టాలతో పాటు విటమిన్ 'సి' లోపించుతుంది. ఒక సిగరెట్టు తాగితే 25 మి.గ్రా. విటమిన్ 'సి' అవసరం ఎక్కువగా ఉంటుందని పరిశీలనలు తెలుపుతున్నాయి. అది అరబత్తాయి పండుతో సమానం.

• పొగ తాగటం వల్ల శరీరం మీద పడే నెగటివ్ ప్రభావాల నుంచి కాపాడుకోవటానికి ఒక్క విటమిన్ 'సి' మాత్రమే కాక 'యాంటీ ఆక్సిడెంట్స్' పుష్కలంగా గల ఆహారాన్ని కూడా తీసుకోవాలన్న సంగతినిమర్చిపోవద్దు. (యాంటీ ఆక్సిడెంట్స్కు సంబంధించిన సమాచారాన్ని ఇదే పుస్తకంలో వేరేచోట చూడవచ్చు!)

ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే... 'బి' విటమిన్ల అవసరం ఎక్కువ.

• ఆల్కహాల్ని అధికంగా సేవించటం వల్ల లేక రెగ్యులర్గా ఆల్కహాల్ని తాగటం వల్ల శరీరంలో 'బి' విటమిన్లు లోపించుతాయి. అందుకని ఈ అలవాటు కలవాళ్ళు 'బి' విటమిన్లు అధికంగా లభించే ఆహారం వేపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది.

వ్యాయామకారులకు... విటమిన్ 'ఇ' అవసరం ఎక్కువ.

• ఎక్కువ సేపు శ్రమకు తట్టుకోవాల్సిన క్రీడాకారులందరికీ కూడా విటమిన్ 'ఇ' రికమెండ్ చేయబడుతోంది. విటమిన్ 'ఇ' తో బాటు ఐరన్ కూడా అధికంగా ఉండేట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది 

జలుబు లేక ఫ్లూ వచ్చినప్పుడు... విటమిన్ 'సి' అవసరం ఎక్కువ.

• జలుబు చేసినప్పుడు రోజుకి 32 గ్రాముల విటమిన్ 'సి'ని అదనంగా తీసుకుంటే జలుబు తక్కువ రోజులకే తగ్గిపోతుందని పరిశీలనలలో వెల్లడైంది. జలుబు ప్రారంభం కాబోతున్నట్లు సూచన అందగానే విటమిన్ 'సి'తో బాటు 'జింక్' ఆహారాన్ని కూడా అదనంగా తీసుకోవాలి.

స్థూల దేహులుకు... క్రోమియం, ఫైబర్ అవసరం ఎక్కువ.

• క్రోమియం శరీరంలో బ్లడ్ఫుగర్ని సమతూకంలో ఉండేట్లు వేస్తుంది. లావుగా ఉండే వాళ్ళకు భోజనానికి భోజనానికి మధ్య ఏరుతిళ్ళు తినాలనిపిస్తుంది. తినకపోతే నీరసంగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళు క్రోమియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

• ఫైబర్ కల ఆహారం మూలంగా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అంతేకాక కడుపు నిండుగా ఉన్నట్లు కూడా అనిపించి మళ్ళీ మళ్ళీ ఆహారాన్ని తినాలనిపించదు.

ఎప్పుడూ అలిసి పోయినట్లుగా ఉంటే... 'బి' విటమిన్లు, ఐరన్, విటమిన్ 'సి' అవసరం ఎక్కువ.

• 'బి' కాంప్లెక్స్ విటమిన్లు శరీరపు మెటబాలిజమ్ ప్రక్రియకు సహకరిస్తాయి. ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపస్తుంటే మీకు ఈ విటమిన్ లు సరిపడా లభించటం లేదన్నమాట!

• ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనత (అనీమియా)కు దారితీస్తుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

• విటమిన్ 'సి' శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేట్లు చూస్తుంది. ఏ కారణమూ లేకుండా మీకు నీరసంగా అనిపిస్తోందంటే బహుశా మీ శరీరం ఏదో తక్కువస్థాయి వైరస్ (Low -grade Virus) తో పోరాటం సల్పుతుండి ఉండవచ్చు. అలాంటప్పుడు మీ శరీరపు పోరాట స్థాయిని బలోపేతం చేయటం కోసం విటమిన్ 'సి' కల ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.

Post a Comment

0 Comments