GET MORE DETAILS

పక్షవాతం నుండి తొందరగా బయట పడే మార్గాలు - సలహాలు

 పక్షవాతం నుండి తొందరగా బయట పడే మార్గాలు -  సలహాలు



పక్షవాతం రోగం కలుగుటకు కారణం మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డకట్టి ప్రసరణకు అవరోధం కలగడం. 

• మెదడుకు ఏభాగంలో అయినా రక్తప్రసరణ ఆగిపోతే, రెండు నిమిషాలు దాటితే ఆభాగం చనిపోతుంది. పక్షవాతం లక్షణాలు కనిపించిన మూడు గంటల్లో గడ్డకట్టిన నెత్తురు కరగడానికి చాలా ఖరీదైన ఇంజక్షన్ ఇస్తారు. 

ఆ క్లాట్సు కరిగి చాలావరకు స్వస్థత చేకూరుతుంది.  

వారం ముందునుంచి ఆ వ్యక్తికలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

1) క్షణం పాటు కంటిచూపు పోయి మళ్ళీ రావడం, 

2) వినికిడి పోయి మళ్ళీరావడం, 

3) ముక్కు నోరు వంకరపోయి మళ్ళీ సద్దుకోడం వంటివి. 

4) రోగికే తెలిసే మరోలక్షణం జీవితంలో ఎన్నడూ అనుభవించని, భయంకరమైన తలనొప్పి ఇరవై నాలుగు గంటలముందు వస్తుంది. 

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులవద్దకు తీసుకుని వెళ్ళాలి. మెదడుకు ఆపరేషన్ కూడా ఒక ఆప్షన్. వైద్యులు నిర్ణయిస్తారు.

• మెదడులో నెత్తురు గడ్డకట్టినా, మెదడులో వెంట్రుకలో సహశ్రాంశమున్న రక్తనాళాలు చిట్లినా పక్షవాతం వస్తుంది. రెంటికీ వైద్యం వేరువేరు. దాన్ని గురించి మరోసారి.

• పక్షవాతం రోగికి ఆరునెలలో చేకూరిన మార్పు తప్ప మరింత మేలు జరగదు.

• ఎడమవైపు క్లాట్సు వస్తే కుడివైపు మెదడు ఆ బాధ్యతలు తాను చేపడుతుంది. రెండోవైపూ అలాగే.

✅ అధిక రక్తపీడనం ఫలితం పక్షవాతం. 

✅ బి.పి 120/80 ఉండాలి. 

జాగ్రత్తలు:

ధూమపానం మానుకోండి. ధూమపానం పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

మద్యపానం తగ్గించండి. అధిక మద్యపానం పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండండి. అధిక బరువు లేదా ఊబకాయం పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఒత్తిడిని నివారించండి. ఒత్తిడి పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ధాన్యాలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఉప్పు తగ్గించండి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కొవ్వు తగ్గించండి. అధిక కొవ్వు తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు పెరిగి పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Post a Comment

0 Comments